కశ్మీర్ పునర్విభజన బిల్లుకు లోక్ సభ ఆమోదం

కశ్మీర్ పునర్విభజన బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. రోజంతా సుదీర్ఘంగా జరిగిన చర్చ తర్వాత… స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు. కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుపై మొదట ఓటింగ్ నిర్వహించారు. దీనిపై మొత్తం 424 ఓట్లు వచ్చాయి. బిల్లుకు మద్దతుగా 351 ఓట్లు ప్డడాయి. బిల్లును వ్యతిరేకిస్తూ 72 ఓట్లు వచ్చాయి.

కశ్మీర్ పునర్విభజన బిల్లుపై తర్వాత ఓటింగ్ పెట్టారు. దీనిపై 440 ఓట్లు పోల్ కాగా.. 370 ఓట్లు అనుకూలంగా… 70 ఓట్లు ప్రతికూలంగా పడ్డాయి.

దీంతో.. కశ్మీర్ పునర్విభజన బిల్లు లోక్ సభ ఆమోదం పొందింది. నిన్న రాజ్యసభలోనూ జమ్ముకశ్మీర్ బిల్లు పాస్ అయింది. దీంతో… జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించినట్టయింది.

Latest Updates