గాంధీ భారత్‌‌లో కలిశాం.. మోడీ ఇండియాలో కాదు

జమ్మూ: కాశ్మీరీలు తమను తాము భారతీయులమని భావించడం లేదని జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా అన్నారు. కాశ్మీరీలు తాము ఇండియన్‌‌గా ఉండాలని అనుకోవడం లేదన్నారు. అదే సమయంలో చైనా, పాకిస్థాన్ అధీనంలోకి వెళ్లాలనీ భావించడం లేదన్నారు. ‘నిజాయితీగా చెప్పాలంటే.. తనను తాను భారతీయుడిగా చెప్పుకునే ఒక్క కాశ్మీరీనైనా ప్రభుత్వం గుర్తిస్తే ఆశ్చర్యమే. మీరు అక్కడికి వెళ్లి ఎవ్వరితోనైనా మాట్లాడండి. వారు మీతో అస్సలు మాట్లాడరు. మేం ఎలా మనుగడ సాగించగలమని ఆశ్చర్యంగా వేస్తోంది. కాశ్మీర్‌‌లో ప్రజలు ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితిలో లేరు. విభజన సమయంలో పాకిస్థాన్‌‌కు వెళ్లిపోవడం ప్రజలకు సులువే. వాళ్లు గాంధీ నేతృత్వంలోని భారత్‌‌లో కలిశారే కానీ మోడీ ఇండియాలో కాదు. ఇప్పుడు చైనా మన వైపుగా దూసుకొస్తోంది. కాశ్మీరీలు చైనా అధీనంలోకి వెళ్లాలనీ భావించడం లేదు. ఎందుకంటే చైనా తమ రీజియన్‌‌లో ఉన్న ముస్లింలతో ఎలా వ్యవహరించిందనేది వారికి తెలుసు. నేను సీరియస్‌‌గా మాట్లాడట్లేదు. నిజాయితీగా మాట్లాడుతున్నా. ప్రజలు నిజంగా ఏం వినొద్దని అనుకుంటున్నారో నేనదే చెబుతున్నా. వాళ్లు పాకిస్థాన్‌‌కు వెళ్లాలనీ కోరుకోవడం లేదు. అక్కడ పరిస్థితి తుప్పు పట్టినట్లుగా ఉంది’ అని పేర్కొన్నారు. కాశ్మీర్ లోయలో ప్రజల మాటలు వినేవారు ఎవరూ లేరన్నారు. ప్రతి వీధిలో సాయుధ దళాలు ఏకే-47తో తిరుగుతున్నారని, స్వేచ్ఛ ఎక్కడ ఉందని ప్రశ్నించారు.

Latest Updates