కథువా రేప్ కేసులో దోషులకు శిక్షలు ఖరారు..

కథువా రేప్ కేసులో దోషులకు శిక్షలు ఖరారు చేసింది పంజాబ్ లోని పఠాన్ కోట్ కోర్టు. ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దోషులు దీపక్ ఖజూరియా, సాంజీ రామ్, పర్వేష్ లకు లైఫ్ టైమ్ శిక్ష వేసింది. అలాగే ఆధారాలు ధ్వంసం చేసేందుకు ప్రయత్నించిన ముగ్గురు పోలీసులకు ఐదేళ్ల పాటు శిక్ష విధించింది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా హత్యాచారం కేసులో పఠాన్ కోట్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఏడుగురు నిందితుల్లో ఆరుగురిని దోషులుగా తేల్చింది. కథువా గ్రామ పెద్ద సాంజీరామ్, పర్వేశ్ కుమార్, ఆనంద్ దత్, ఇద్దరు స్పెషల్ పోలీసు అధికారుల దీపక్ కజూరియా, సురేంద్ర వర్మ, హెడ్ కానిస్టేబుల్ తిలక్ రాజ్ ను దోషులుగా ప్రకటించింది పఠాన్ కోట్ కోర్టు. ఈ కేసులో ఎనిమిదో నిందితుడిగా ఉన్న మైనర్ పై ఇంకా దర్యాప్తు పూర్తి కాలేదు. పఠాన్ కోట్ సెషన్స్ కోర్టులో గత వారం విచారణ ముగియగా.. ఇవాళ (సోమవారం) న్యాయమూర్తులు తీర్పును వెలువరించారు.

గత ఏడాది జనవరిలో జమ్ముకశ్మీర్ లోని కథువాలో ఎనిమిదేళ్ల బాలికను అత్యంత దారుణంగా ఆలయంలోనే హత్యాచారం చేశారు. బాలికకు మత్తు పదార్థాలు ఇచ్చి, సామూహిక అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటన పట్ల నిరసనలు హోరెత్తాయి. నిందితులకు ఉరి శిక్ష విధించాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. అయితే కేసు విచారణకు జమ్మూకశ్మీర్ లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో సుప్రీంకోర్టు పఠాన్ కోట్ కోర్టుకు బదిలీ చేసింది.

Latest Updates