2001లో పూట గడవనోళ్లు కోట్లు సంపాదించిన్రు

16వ స్థానంతో కేసీఆర్ పాలనేందో తేలిపోయింది-ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

యాదాద్రి, వెలుగు: సీ ఓటర్​సర్వేలో తెలంగాణకు 16వ స్థానం దక్కడంతోనే.. ముఖ్యమంత్రి కేసీఆర్​ పాలన ఎలా ఉందో తేలిపోయిందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. దేశంలోనే తెలంగాణ ఫస్ట్​ అంటే ఇదేనా అని ఎద్దేవా చేశారు.  జిల్లా కేంద్రమైన భువనగిరిలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్​రెడ్డిని ఉద్దేశించి ‘2001లో పూటగడవని వ్యక్తి అక్రమాల ద్వారా వందల కోట్లు సంపాదించారు. జాజిరెడ్డిగూడెం, జానకీపురంలో ఇసుక అక్రమాలకు పాల్పడ్డారు. శంషాబాద్​లో అతిపెద్ద ఫాంహౌస్​ నిర్మించుకున్నారు. సొంతూరు నాగారంలో రూ. 100 కోట్లతో ఇల్లు కట్టుకున్నారు. మూడు హత్య కేసుల్లో ఏ-1, ఏ-2, ఏ-6గా ఉన్నారని, ఇలాంటి వ్యక్తి మంత్రి కావడం సిగ్గుపడాల్సిన విషయం’ అని అన్నారు. కాంగ్రెస్​ కారణంగానే 203 జీవో వచ్చిందంటూ గుత్తా సుఖేందర్​రెడ్డి విమర్శించడంపై ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్​ దయవల్లే నల్గొండ నుంచి ఎంపీగా గుత్తా  గెలిచారన్నారు. పూటకో పార్టీ మార్చే గుత్తా కాంగ్రెస్​ను విమర్శిస్తారా.. అని మండిపడ్డారు. ఆరేళ్లుగా టీఆర్ఎస్​అధికారంలో ఉంటే జీవో రావడానికి కాంగ్రెస్​ఎలా కారణమవుతుందని ప్రశ్నించారు. 203 జీవో రావడానికి సీఎం కేసీఆర్​కారణమన్నారు.

గంధమల్లపై పోరుబాట

గంధమల్లను చూపించి రెండుసార్లు గెలిచిన ఆలేరు ఎమ్మెల్యే సునీత వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కోమటిరెడ్డి డిమాండ్​ చేశారు. గంధమల్ల రిజర్వాయర్ ను రద్దు చేయడం వల్ల ఆలేరు నియోజవకర్గానికి సాగునీరు లభించదన్నారు. ఈ మధ్యే ప్రారంభించిన కొండపోచమ్మ తొందరగా పూర్తయిందని, బస్వాపురం ఎందుకు కాలేదని నిలదీశారు. గంధమల్ల రిజర్వాయర్​ను పునరుద్ధరించాలని, బస్వాపురం పూర్తి చేయాలని డిమాండ్​ చేస్తూ జిల్లాలో పోరాటయాత్ర ప్రారంభిస్తామని ప్రకటించారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈసారి బోనాల పండుగ లేనట్లే

నిజంగానే రాజ్​భవనం

అరటిపండ్లు అమ్ముతున్న టీచర్

Latest Updates