కేసీఆర్, ఎంఐఎం కలసి జనాలను మోసం చేస్తున్నారు

తెలంగాణలో తండ్రి, కొడుకుల రాజ్యం నడుస్తుందని, సిటీలో ఎక్కడ చూసినా కేసీఆర్, కేటీఆర్ ల‌ ప్లెక్సీ లు దర్శనం ఇస్తున్నాయని అన్నారు గోశామహాల్ ఎమ్మెల్యే రాజసింగ్. ఎన్నిక‌ల ప్ర‌చారంలో బీజేపీ కమ్యూనల్ గొడవలు చేస్తది అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కేసీఆర్, ఎంఐఎం కలసి జనాలను మోసం చేస్తున్నారని అన్నారు.

ఓల్డ్ సిటీ లో అభివృద్ధి ఉంది అని ఎంఐఎం అంటోంద‌ని, అభివృద్ధి ఎక్కడ ఉందో చెప్పాల‌న్నారు రాజాసింగ్. చిన్న చినుకు పడితే ఓల్డ్ సిటీ ఆగం అవుతుందని, గతంలో ఎలాంటి దుస్థితి ఉందో ఇప్పటికే అదే తరహ పాత పట్నంలో ఉందని అన్నారు. ఓల్డ్ సిటీలో మానవ అక్రమ రవాణా జరిగినా వాళ్ళను పట్టించుకునే నాథుడు లేడని, 10 వేల రూపాయల పేరుతో ఎంఐఎం ముస్లిం సోదరులను మోసం చేసింద‌న్నారు. ప్ర‌చారంలో ఎంఐఎం కార్యకర్తలు ఓట్లు అడిగితే ముస్లిం మహిళలు చెప్పు చూపిస్తున్నార‌ని అన్నారు.

ప్రతి ఒక్క ఓటర్ మేల్కోవాలని, మీ పిల్లలు విద్యావంతులు కావాలంటే బీజేపీ కి ఓటు వెయ్యండని అన్నారు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఎంఐఎం అదే పార్టీతో జతకడ్తదని అన్నారు రాజాసింగ్.

Latest Updates