నంది రిజర్వాయర్‌ కట్టపై కేసీఆర్, మంత్రి కొప్పుల పేర్లు

కాకతీయుల పాలనకు చిహ్నమైన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని నందిమేడారం చెరువు (నంది రిజర్వాయర్‌) కట్టపై మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తన, సీఎం కేసీఆర్‌ పేర్లను రాయించడం వివాదాస్పదమైంది. చారిత్రకంగా ప్రసిద్ధిచెందిన నందిమేడారం పెద్ద చెరువును కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 0.747 టీఎంసీల కెపాసిటీ రిజర్వాయర్‌గా మార్చారు. సీఎం కేసీఆర్‌ నంది మేడారం పంప్‌హౌస్‌, నందిమేడారం చెరువు పేరను ్ల నంది పంప్‌హౌస్‌, నంది రిజర్వాయర్‌గా మార్చారు. రాష్ట్ర చరిత్రలో కాకతీయుల గుర్తుగా నిలిచిన తమ ప్రాంత చెరువు పేరు మార్చడం పై అప్పుడే స్థానికుల్లో కొంత అసంతృప్తి వ్యక్తమైంది. తాజాగా 15 రోజుల కింద ఈ రిజర్వాయర్‌ దగ్గర పార్క్‌ పనులను మంత్రి కొప్పుల ప్రారంభించారు.

కట్ట కింద ఓవైపు పార్క్‌పనులు కొనసాగుతుండగా..

కట్టపై సిమెంటుతో జై కేసీఆర్‌, జై ఈశ్వరన్న పేర్లను ఏర్పాటు చేశారు. కట్టపై నాయకుల పేర్లు ఏర్పాటు చేయడాన్ని చరిత్రకారులు, స్థానికులు తప్పు పడుతున్నారు. రిజర్వాయర్‌కు తన పేరు పెట్టుకునేందుకే మంత్రి ఇలా చేశారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు.

Latest Updates