కేసీఆర్ బర్త్ డే వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన తలసాని

 సికింద్రాబాద్ : ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా.. నెక్లెస్ రోడ్డులోని జలవిహార్ లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఆ పార్టీ లీడర్లు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జలవిహార్ లో కేసీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఏర్పాట్లను ఈ ఉదయం పర్యవేక్షించారు తలసాని. హోమాలు, యజ్ఞాలు, కేసీఆర్ చిన్ననాటి విశేషాలతో కూడిన ఫొటో ఎగ్జిబిషన్ ను అక్కడ పెడుతున్నారు.

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీలో కీలక నేత-ఎమ్మెల్యే హరీష్ రావు, ఎంపీ కవిత ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. తెలంగాణ కళాకారులు… ఫిబ్రవరి 17న సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారని తలసాని చెప్పారు.

Latest Updates