17 సీట్లు గెలిచినా కేసీఆర్ ప్రధాని కాలేరు: లక్ష్మణ్

కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ‘రైతు బాంధవుడు నరేంద్రమోడీ’ అనే పోస్టర్ ను విడుదల చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డా.లక్షణ్. సభలో మాట్లాడిన ఆయన..  మోడీ మరోసారి ప్రధాని అవుతారని అన్నారు. రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాల్లో బీజేపీ పోటీచేస్తుందని చెప్పారు.  ‘కమల్ జ్యోతి’ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని బీజేపీ ప్రభుత్వ లబ్ధిదారుల ఇండ్లలో దీపాలను వెలిగిస్తాం అని లక్షణ్ తెలిపారు. రాష్ట్రానికి నితంతర విద్యుత్ రావడంలో బీజేపీ పాత్ర ఎంతో ఉందని అన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలైనా మంత్రివర్గం విస్తరించకపోవడం బాధాకరమని చెప్పారు. కేబినెట్ లేకపోవడంతో రాష్టంలో పాలన స్తంభించిపోయిందని.. వందల కొద్దీ ఫైల్స్ పెరుకుపోతున్నాయి తెలిపారు. టీఆర్ఎస్ 17 స్థానాలు గెలిచినంత మాత్రాన ప్రధానమంత్రి కాలేరని లక్షణ్ తెలిపారు.

మోడీ పరిపాలనలో పేదల జీవితాలు బాగుపడ్డాయని రాష్ట్ర బీజేపీ చీఫ్ లక్షణ్ తెలిపారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టిందని చెప్పారు. ‘భారత్ కి మన్ కీ బాత్- మోడీకే సాత్’ అనే కార్యక్రమంలో భాగంగా పలు వర్గాల ప్రజల సలహాలు తీసుకుంటున్నామని…  ‘మేరా పరివార్- బీజేపీ పరివార్’ అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి కార్యకర్త ఇంటిపై బీజేపీ జెండా ఎగరేస్తామని లక్షణ్ చెప్పారు.

‘చంద్రబాబు అవినీతి గూరించి మాట్లాడటం విడ్డూరం’
మోడీకి సరితూగే నాయకుడు దేశంలోనే లేరని లక్షణ్ అన్నారు. మోడీ కేంద్రంగానే ఎన్నికలు జరుగబోతున్నాయని చెప్పారు. ఓటుకు నోటు కేసు ఎదుర్కొంటున్న చంద్రబాబు కూడా అవినీతి గూరించి మాట్లాడటాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. “దేశప్రజలు, పేదలను కించపరిచేలా చంద్రబాబు మాట్లాడుతున్నారు. కోట్లరూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు నాశనం చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబాల కోసమే పనిచేస్తాయి. ప్రజలు మోడీ వైపే ఉన్నారు. మళ్ళీ మోడీనే అధికారంలోకి వస్తారు. బీజేపీ చేపట్టే విస్తృత కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వామ్యం కావాలి.” అని లక్షణ్ అన్నారు.

Latest Updates