పుట్టిన రోజు వేడుకలొద్దు: పుల్వామా ఘటనపై కేసీఆర్ సంతాపం

కశ్మీర్లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్ర దాడిని సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో అనేక మంది జవాన్లు మరణించడంతో పాటు చాలా మంది తీవ్రంగా గాయపడడం పట్ల తీవ్రంగా కలత చెందానని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢమైన సానుభూతి తెలిపారు.

కశ్మీర్ లో జరిగిన దాడి నేపథ్యంలో దేశ ప్రజలంతా విషాదంలో మునిగిపోయారని, తాను కూడా తీవ్రంగా మనస్థాపానికి గురయ్యానని కేసీఆర్ అన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ నెల 17న తన పుట్టిన రోజు సందర్భంగా ఎలాంటి వేడుకలు జరుపుకోవద్దని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎవ్వరూ తన పుట్టిన రోజు వేడుకలు జరపవద్దని సూచించారు.

Latest Updates