విద్యార్థుల జీవితాలతో కేసీఆర్ ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది

విద్యార్థుల జీవితాలతో కేసీఆర్ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ప్రగతి భవన్ ముట్టడించిన NSUI నాయకుల అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు.

తెలంగాణ వచ్చిన తర్వాత విద్యార్థుల జీవితాలను రాష్ట్ర ప్రభుత్వం నాశనం చేస్తోందన్నారు. విద్యార్థులతో ,యువతతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం ఎక్కువ రోజులు అధికారంలో ఉండదని స్పష్టం చేశారు.  విద్యార్థుల ఇబ్బందులను పరిష్కరించని ప్రభుత్వం… ఇలా అక్రమ అరెస్ట్ లు చేస్తే ఎలా అని ప్రశ్నించారు.  అరెస్టు చేసిన NSUI నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తామే మళ్ళీ ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. విద్యార్థులు ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలన్నారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.

Latest Updates