కేసీఆర్ ముస్లింలకు, క్రైస్తవులకు ద్రోహం చేస్తున్నారు

కేంద్ర ప్రభుత్వం పథకం ఆవాస్ యోజన కింద దేశ వ్యాప్తంగా రెండు కోట్ల ఇళ్లను నిర్మించామన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. అయితే  తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఆ ఇళ్లు ఇంకా ఎందుకు నిర్మాణం కాలేదని ప్రశ్నించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన…ఈ పథకం కింద తెలంగాణ కు కేంద్రం ఇచ్చిన నిధులను కాళేశ్వరం ప్రాజెక్ట్ కు, మిషన్ భగీరథకు మళ్లించిందని ఆరోపించారు. ఈ విషయమై రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని సూచించారు.

ఆవాస్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఇళ్లు నిర్మించిందన్న కేటీఆర్ ప్రశ్నకు అర్వింద్ స్పందిస్తూ, రెండు కోట్ల ఇళ్లు నిర్మించారని, ఈ విషయాన్ని రాష్ట్రపతి తన ప్రసంగంలో కూడా ప్రస్తావించారని గుర్తుచేశారు. ‘ఆయుష్మాన్ భారత్’కు తెలంగాణ ప్రజలను దూరంపెట్టే దుర్మార్గపు ఆలోచన కేసీఆర్, కేటీఆర్ లది అని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందిన కుటుంబాల్లో ముస్లింలు, క్రైస్తవులు లేరా.. అని ప్రశ్నించారు. ముస్లింలకు, క్రైస్తవులకు ఎవరైనా ద్రోహం చేస్తున్నారంటే అది కేసీఆరేనని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ అర్వింద్.

Latest Updates