ఎంఐఎం నేతలకి భయపడే కేసీఆర్ విమోచన దినోత్సవం చేయడం లేదు

ఎంఐఎం పార్టీ నేతలకి భయపడే సీఎం కేసీఆర్ విమోచన దినోత్సవం చేయడం లేదన్నారు. బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని అప్పటి కాంగ్రెస్ నేతలను నిలదీసిన కేసీఆర్… ఇప్పుడేమైందని ప్రశ్నించారు వివేక్. జోడేఘాట్ లో 50 బెడ్రమ్ ఇండ్లు నిర్మిస్తామన్న కేటీఆర్ హామీ ఏమైందన్నారు.

తెలంగాణ సొమ్ము ఎలా దోచుకోవాలనే ఒకే ఒక్క పనిలో కేసీఆర్ కుటుంబం ఉందని..అబద్ధాల కోరు, పిరికి పంద కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలు బానిసలుగా ఉంచాలన్నదే కేసీఆర్ లక్ష్యమని..కమీషన్ల కోసమే ఆంధ్ర కాంట్రాక్టర్లకు పనులు ఇస్తున్నారన్నారు. తెలంగాణ పిల్లలు మంచిగా చదువుకోవద్దని, అక్కడి విద్యార్థులను అణగదొక్కలనే విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయించడం లేదన్నారు రాబోయే రోజుల్లో కేసీఆర్, టి.ఆర్.ఎస్ పార్టీకి ప్రజలు బుద్దిచెప్పాలని తెలిపారు వివేక్ వెంకటస్వామి.

Latest Updates