సెక్రటేరియట్‌కు రాని సీఎం దేశంలో కేసీఆర్ ఒక్కడే

  • సీఎం క్యాంప్ ఆఫీస్ మాఫియాకు అడ్డగా మారింది
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

హైదరాబాద్: సెక్రటేరియట్ రాని సీఎం దేశంలో కేసీఆర్ ఒక్కడేనని.. కేసీఆర్ ను చూసి దేశంలో ప్రజలు నవ్వుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. మూర్ఖపు ముఖ్యమంత్రి సాగనంపాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా కేసీఆర్ పని చేస్తున్నడని, సీఎం క్యాంప్ ఆఫీస్ లాండ్ మాఫియా, ఇసుక  వంటి అన్ని మాఫియా లకు  అడ్డాగా మారిపోయిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని.. ప్రజల కోసం పని చేయకుండా రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా  మార్చాడని ఆయన విమర్శించారు. కేసీఆర్ దుర్మార్గపు పాలనను అడుగడుగునా అడ్డుకుంటామని ఆయన ప్రకటించారు. కరోనా వస్తే ప్రజలకు అండగా నిలబడకుండా ఫామ్ హౌస్ లో పడుకున్నాడని ఎద్దేవా చేశారు. కరోనా లో ప్రజలకు సేవ చేస్తూ నలుగురు బిజెపి కార్యకర్తలు ప్రాణాలు వదిలారని గుర్తు చేశారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిన కేసీఆర్ వాటిని అమలు చేయడం మర్చిపోయాడన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఉద్యోగాలూ, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మాట మార్చాడని, బర్రెలు, గొర్రెలు కాసుకుని బతాకలని ప్రజల్ని చులకన చేసి మాట్లాడుతున్నాడని, రైతులను సన్న వడ్లు వేసుకోవాలని చెప్పి నిండా ముంచేశాడన్నారు. కేసీఆర్ పార్టీ కారు పంచరు అయిపోవడంతో కేసీఆర్ సారు బేకార్ అయ్యిండని, రజాకార్ల వారసులు ఎంఐఎం నేతలను పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడని విమర్శించారు.

ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు

తెలంగాణలోనే కాదు.. మొత్తం దేశమంతా ఏం జరుగుతుందో ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని, ప్రజలకు నరేంద్ర మోడీ, కమలం పువ్వు గుర్తే కనిపిస్తోందని, నలుగురు ఎంపీలను, దుబ్బాక ఉప ఎన్నికతోపాటు జీహెచ్ఎంసీలో కార్పొరేట ర్ లను గెలిపించి బ్రహ్మరథం పట్టారని బండి సంజయ్ వివరించారు. ప్రస్తుతం ట్రెండ్ గమనిస్తే 2023 లో బీజేపీదే అధికారం అనే విషయం అందరికీ స్పష్టం అవుతుందన్నారు. గోల్కొండ కోట పై కాషాయాపు జెండా ఎగుర వేయాల్సిన సమయం దగ్గరపడుతోందన్నారు. కేసీఆర్ రాక్షస పాలన అంతం చేసి గోల్కొండ కోట పై కాషాయ జండా ఎగురవేయడమే లక్ష్యంగా పని చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. నమ్మిన సిద్ధాంతం కోసం ఎందరో ప్రాణ త్యాగం చేశారు.. వారి ఆశయాలను నెరవేర్చేందుకు ముందుకు సాగుదామని ఆయన కోరారు. లాక్ డౌన్ కి మోడీ పిలుపు నిస్తే దేశ ప్రజలు అండగా నిలిచి సహకరించారని, నడ్డా పిలుపు మేరకు బీజేపీ కార్యకర్తలు ఎన్నో సేవ కార్యక్రమాలు చేశారు.. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ కరోనా బారినపడి కార్యకర్తలు మరణించారని గుర్తు చేశారు. కరోన సమయంలో కేసీఆర్ ప్రజలను వదిలేసి అడ్రస్ లేకుండా పోయాడు, ఆయుష్మాన్ భారత్ ని చులకన చేస్తూ అమలు చేయకపోవడం వల్ల పేద వారికి కరోనా సోకితే కార్పోరేట్ వైద్యం అందక ఇబ్బందులు పడ్డారు, ఎంతో మంది మరణించారని బండి సంజయ్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ మూర్ఖంగా వ్యవహరించాడని, ప్రజల్లో ఆత్మ స్టైర్యం నింపే ప్రయత్నం చేయలేదు.. ఫార్మ్ హౌస్ కు పోయే దారిలో భారత్ బయో టెక్ ఉంటే కనీసం సీఎం పోయిన దాఖలాలే లేవు.. ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్,  టీఆర్ఎస్ లో నిఖార్సైన హిందువులు ఉన్నారు.. అయోధ్య లో రామ మందిర నిర్మాణాన్ని స్వాగతిస్తారా? లేదా ? స్పష్టం చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ధనిక రాష్ట్రం తెలంగాణని అప్పుల రాష్ట్రం గా మార్చిన కేసీఆర్ పై ప్రజల్లో విశ్వాసం పోయింది, సెక్రటేరియట్ కి రాని సీఎం గా రికార్డ్ సాధించారు.. రజాకార్ల వారసులను ప్రగతి భవన్ లో పక్కన కూర్చోబెట్టుకొని పాలన చేస్తున్నాడని ఆరోపించారు. 13 వేల 500  కంపెనీ లు వస్తే, 3 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టయితే ముఖ్యమంత్రి కి పూజ చేస్తా.. దీనిపై శ్వేత పత్రం విడుదల చేయాలి… లేకుంటే బడితే పూజ చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. కుల వృత్తులను నాశనం చేసి కులాల పేరుతో విభజన చేస్తున్నాడని, ముస్లింలను బీసీలలో చేర్చడం వల్ల వారు నష్టపోతున్నారు.. వారికి 12 శాతం రిజర్వేషన్లు ఇస్తా అంటున్నాడు..  ప్రగతి భవన్ ను అన్ని మాఫియాలకు అడ్డాగా మార్చేశారని, రాష్ట్రం లో అధికారంలోకి వచ్చేది బీజేపీ నని గుర్తించి  పోలీస్ లను అడ్డం పెట్టుకొని బీజేపీ ని ఆపాలని సీఎం ప్రయత్నం చేస్తున్నాడని, అక్రమ కేసులతో బీజేపీ ని ఎంతోకాలం అడ్డుకోలేరని బండిసంజయ్ అభయం ఇచ్చారు. అందరం కలిసి కట్టుగా పనిచేద్దాం…త్యాగాలు చేసే పార్టీ లో మనం ఉన్నాం.. హిందువులను ఓటు బ్యాంకు గా మారుద్దాం.. తెలంగాణ తల్లిని కేసీఆర్ కబంధ హస్తాల నుండి విముక్తి చేద్దాం..’’ అని బండి సంజయ్ పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి..

కాబూల్ లో దారుణం.. సుప్రీంకోర్టు మహిళా జడ్జీలపై కాల్పులు

బిడెన్ బృందంలో 20 మంది ఇండో-అమెరిక‌న్లు

పోషక విలువలున్నాయని ఎక్కువగా తింటే..

Latest Updates