ఖమ్మం నుంచి కేసీఆర్‌ ఎంపీగా పోటీ చేయాలి

ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి సీఎం కేసీఆర్‌ పోటీ చేయాలన్నారు ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ టీఆర్‌ఎస్‌ నేత పిడమర్తి రవి. సత్తుపల్లిలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్‌ ఇక్కడి నుంచి పోటీ చేస్తే తప్ప..ఖమ్మంలో TRS బలోపేతమయ్యేలా లేదన్నారు. ఒక వేళ సీఎం  పోటీ చేయకపోతే…ఆయన ఎవరి పేరు ప్రకటిస్తే వారికి తమ మద్దతు  ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ నెల 16న తారీకున సత్తుపల్లి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంతో పాటు సర్పంచ్ లకు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనికి పెద్ద ఎత్తున TRS నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు పిడమర్తి.

Latest Updates