కేసీఆర్ జూట కోర్.. తారకరాముడు కాదు.. తుపాకి రాముడు

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ జూటా కోర్.. ఆయన కొడుకు కేటీఆర్ తారకరాముడు కాదు.. తుపాకి రాముడు అంటూ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐ ఎస్ సదన్ డివిజన్ లోని చింతల్ బస్తీ లో బీజేపీ అభ్యర్థి  జంగం శ్వేతా మధుకర్ రెడ్డి తరపున  డి కే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్,  మున్సిపల్ మంత్రి కే టీ ఆర్ లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ జూట కోర్… అని .. ఆయన కొడుకు కే టీ ఆర్ తారక రాముడు కాదు ..తుపాకీ రాముడు అంటూ… విరుచుకుపడ్డారు.  జీహెచ్ఎంసీ  ఎన్నికల్లో  ప్రజల కు కల్లబొల్లి మాటలు చెబుతూ ఓట్ల కోసం ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆమె విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి గణనీయంగా ఇస్తున్న నిధులను  పథకాల పేర్లు మార్చి తామే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్టు  ఢంకా మోగిస్తున్నారని ఆమె ఆరోపించారు. అలాంటి జూట మాటలు నమ్మి మోసపోవద్దని, దుబ్బాక ప్రజల తీరుగా తెలివిగా నిర్ణయం తీసుకున్నట్లు  హైదరాబాద్ అభివృద్ధి కోసం  బీజేపీ ని గెలిపించాలని డీకే అరుణ కోరారు.

for more News…

కట్టలుతెంచుకున్న వరి రైతుల ఆగ్రహం.. రోడ్డుపై వరిధాన్యం పోసి నిప్పంటించి నిరసన  

డొంక తిరుగుడు సమాధానం.. కరీంనగర్ జిల్లా కోర్టు ఆగ్రహం

కరోనాపై నిర్లక్ష్యం: హెల్త్ డైరెక్టర్ కు కోర్టు ధిక్కరణ నోటీసు

రుచి వాసన లేకపోతే కరోనా సోకినట్లేనా?

Latest Updates