రాష్ట్రాలకు పన్నుల వాటా 50% పెంచాలి : కేసీఆర్

హైదరాబాద్ : తెలంగాణ దేశానికే రోల్ మోడల్ గా మారిందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. కొత్త మంత్రులతో కలిసి… 15వ ఆర్థిక సంఘం ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు… కేంద్రం నుంచి అందాల్సిన సాయంపై ఫైనాన్స్ కమిటీకి వివరించారు. అటు తెలంగాణలో అమలవుతున్న స్కీంలను మెచ్చుకుంది ఆర్థిక సంఘం. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఉన్నతాధికారులు. హైద్రాబాద్ జూబ్లీహాల్లో 15 వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ నందకిషోర్ సింగ్ తో పాటు, సభ్యులతో మాట్లాడారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, అవసరాలను ఆర్థిక సంఘం సభ్యులకు వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ తీవ్ర నిర్లక్ష్యానికి గురైందన్నారు, బంగారు తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించారు కేసీఆర్. భారీ లక్ష్యంతో కడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులిచ్చేలా కేంద్రానికి సిఫార్సు చేయాలని అడిగారు ముఖ్యమంత్రి. ప్రతీ ఇంటికి మంచినీరు అందించాలనే ఉద్దేశంతో మిషన్ భగీరథ చేపట్టామన్నారు. రాష్ట్రంలో పంచాయతీలు, మున్సిపాల్టీలు పెరిగినందున  నిధులు కూడా పెంచాలన్నారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై మరింత అవగాహన అవసరమన్న సీఎం…. GSDP లో మూడు శాతానికి పైగా రుణం తీసుకునే అవకాశం ఇవ్వాలని కోరారు.

వివిధ రంగాల్లో రాష్ట్ర సర్కార్ పనితీరుపై ప్రశంసలు కురిపించింది 15 వ ఆర్థిక సంఘం. నీటి పారుదల, సంక్షేమ రంగాల్లో తెలంగాణ ప్రగతి బాగుందని చెప్పింది. ప్రతీ ఇంటికి సురక్షిత మంచి నీటి సరఫరా కోసం చేపట్టిన మిషన్ భగీరథ అద్భుత పథకమన్నారు.  రెసిడెన్షియల్ స్కూళ్ళతో జనానికి మేలు జరుగుతోందన్నారు… సంఘం ఛైర్మన్ NK సింగ్. తమ పర్యటనలో వివిధ రాజకీయ పక్షాలను కలిశామని చెప్పార. ఇవాళ కూడా రాష్ట్రంలోనే ఉండనున్నారు 15 వ ఆర్థిక సంఘం ప్రతినిధులు.

Latest Updates