రేపు, ఎల్లుండి జిల్లా కలెక్టర్లతో కేసీఆర్ సమావేశం

హైదరాబాద్ : రేపు ఎల్లుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కానున్నారు. మంగళవారం రోజున బేగంపేట్ లోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో ఉదయం 11గంటల 30 నిమిషాలకు మీటింగ్ మొదలుకానుంది. రెండురోజుల ఈ సమావేశాలకు  మంత్రులు కూడా హాజరుకానున్నారు.

కొత్త రెవెన్యూ చట్టంపై రెండురోజుల పాటు సుదీర్ఘంగా సీఎం కేసీఆర్.. కలెక్టర్లతో చర్చిస్తారు. భూ ప్రక్షాళన తర్వాత.. రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నాయనేది కలెక్టర్లకు ఒక అవగాహన వచ్చి ఉంటుందని భావిస్తున్నానని సీఎం చెప్పారు. అందుకే కొత్తచట్టంలో కలెక్టర్లను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించినట్టుగా కేసీఆర్ అధికారులతో చెప్పారు.

Latest Updates