చెరువులు కళకళలాడాలె : కేసీఆర్

హైదరాబాద్ : రాష్ట్రంలో చెరువులు మళ్లీ నీటితో కళకళలాడాలి. అన్ని చెరువులు నిండాలి. మిషన్‌‌ కాకతీయ పూర్తి స్థాయిలో సక్సెస్‌ కావాలి. కాకతీయుల కాలంలో నిర్మించిన గొలుసుకట్టు వ్యవస్థలను పునరుద్ధరించాలె. కాలువలు తవ్వాలె. సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయండి’’అని సీఎం కేసీఆర్‌‌ అధికారులను ఆదేశించారు.  ప్రగతి భవన్‌ ‌లో మిషన్‌‌ కాకతీయ, చిన్న నీటి వనరులపై సమీక్షించారు. నీళ్లు నిండితేనే ‘మిషన్​’కు సార్థకత చెరువులు నీటితో కళకళలాడితేనే మిషన్ కాకతీయకు సార్థకత చేకూరుతుందని కేసీఆర్‌‌ చెప్పారు. వర్షం నీళ్లు చెరువులకు చేరేలా చేయాలని, కొత్తగా నిర్మిస్తున్న ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీళ్లతో చెరువులు నింపాలని అధికారులకు సూచించారు.

‘‘రాష్ట్రం లో 12,150 గొలుసుకట్టుల కింద 27,800 చెరువులున్నాయి. గొలుసుకట్టులోని మొదటి చెరువుకు నీరందిస్తే, దాని కింది మిగతా చెరువులకు నీరందేలా ఫీడర్ కెనాల్స్ సిద్ధం చేయాలి. ఒకప్పుడు జాలువారు ఉండేది. బోర్లు ఎక్కువ వేయడం, భూగర్భ జలాలు అడుగంటి పోవడం వల్ల ఇప్పుడు జాలువారు లేదు. చెరువులు నిండితే మళ్లీ భూగర్భ జలాలు పెరుగుతాయి. మళ్లీ జాలువారును చూడొచ్చు. ఒక చెరువు నుంచి మరో చెరువుకు నీళ్లం దుతాయి. దీనికోసం అవసరమైన ఫీడర్ కెనాల్​ వ్యవస్థను పునరుద్ధరించాలి. ఇంజనీరింగ్ అధికారులతో వర్క్ షాపు నిర్వహించి, దీని కోసం సమగ్ర ప్రణాళిక రూపొందించాలి. అది ఈ సీజన్లోనే పనులు ప్రారంభం కావాలి’’అని ఆదేశించారు. చెరువులు, చెక్ డ్యాముల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని సరిగ్గా లెక్క తీయాలని ఆదేశించారు.

Latest Updates