రాత్రికి రాత్రే కేసీఆర్​ పార్క్​.. కేటీఆర్​ నగర్

  • ప్రత్యేకంగా ఏర్పాటు చేయించిన మంత్రి శ్రీనివాస్​గౌడ్​
  • ఆ రెండింటినీ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

మహబూబ్నగర్, వెలుగుఒక పక్క ‘కేసీఆర్​ పార్క్’​.. మరో పక్క ‘కేటీఆర్​ నగర్​’.. ఇదీ పాలమూరులో రాత్రికి రాత్రి వెలసిన బోర్డులు. వీటిని రాష్ట్ర ఆబ్కారీ మంత్రి శ్రీనివాస్​గౌడ్​ ప్రత్యేకంగా ఏర్పాటు చేయించారు. ఊహించని ఈ పరిణామానికి సాధారణ జనమే కాదు ఆఫీసర్లు, టీఆర్​ఎస్​ నేతలు కూడా షాక్ తిన్నారు. తన తండ్రి పేరిట ఉన్న ‘కేసీఆర్​ ఎకో అర్బన్​ పార్కు’ను, తన పేరిట ఉన్న డబుల్​ బెడ్​రూం ఇండ్ల కాలనీని సోమవారం మున్సిపల్ మంత్రి కేటీఆర్​ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్​గౌడ్, ఈటల రాజేందర్​ తదితరులు పాల్గొన్నారు. మహబూబ్​నగర్​ సమీపంలోని మయూరి నర్సరీని నాలుగు సంవత్సరాల కింద మయూరి పార్కుగా మార్చారు. దీనిని రూ. 80 కోట్లతో 232 ఎకరాల్లో ‘మయూరి ఎకో అర్బన్​ పార్కు’గా తీర్చిదిద్దుతున్నారు. తాజాగా మహబూబ్​నగర్, హన్వాడ, నవాబుపేట, జడ్చర్ల మండలాల సరిహద్దుల్లోని రిజర్వ్​ ఫారెస్ట్​ భూములన్నింటినీ కలుపుకొని 2,087 ఎకరాల్లో డెవలప్​చేయాలని  భావించారు. మంత్రి శ్రీనివాస్​గౌడ్​ ఈ ఎకో పార్కు పేరును ‘కేసీఆర్​ అర్బన్​ ఎకో పార్కు’గా మార్పు చేయించారు. ఆదివారం ఉదయం పర్యటించిన కలెక్టర్, ఇతర ఆఫీసర్లకు కూడా తెలియకుండా రాత్రికి రాత్రే బోర్డు పెట్టించినట్లు స్థానికంగా చర్చ నడుస్తోంది.మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలోని వీరన్నపేట సమీపంలో రూ. 40 కోట్లతో నిర్మించిన 660 డబుల్​బెడ్​ రూం ఇండ్లకు ‘కేటీఆర్​ నగర్’ గా పేరుపెట్టడం కూడా అదే రీతిగా జరిగిందన్న చర్చ సాగుతోంది.

ఇండ్ల కోసం మంత్రులకు నిరసన సెగ

అర్హులైన తమకు డబుల్​ బెడ్​ రూం ఇండ్లు  కేటాయించలేదని ఆరోపిస్తూ కొందరు.. మంత్రులు కేటీఆర్​, శ్రీనివాస్​గౌడ్, ఈటల రాజేందర్​ కాన్వాయ్​కు అడ్డుతగిలారు. తమ భూములను టీఆర్​ఎస్​ నేతలుతమ భూములను కబ్జా చేశారని ఆరోపిస్తూ ఇంకొందరు బాధితులు రోడ్డుకు అడ్డంగా పడుకొని ఆందోళన చేశారు. పోలీసులు క్షణాల్లో వారిని పక్కకు పడేశారు. డబుల్​బెడ్​ రూం ఇండ్ల ఓపెనింగ్‌‌కు తనను ఆహ్వానించలేదని స్థానిక బీజేపీ కౌన్సిలర్​ అంజయ్య నిరసన వ్యక్తం చేశారు.

 

కరోనా కేసుల్లో తిరకాసు..వేల కేసులు దాస్తున్న సర్కార్

 

 

Latest Updates