రైతుకు ఫోన్ చేసి మాట్లాడిన సీఎం కేసీఆర్

అనుమతి లేకుండా తమ భూమిని వేరేవారికి రిజిస్ట్రేషన్ చేశారని ఓ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు ఓ రైతు. 50 సంవత్సరాలు సాగు చేస్తున్న భూమిను తమకు తెలియకుండానే VRO ఇతరులకు పట్టాచేసి తమకు అన్యాయం చేశారని వీడియోలో మాట్లాడాడు. ఈ వీడియో చక్కర్లు కొడుతూ సీఎం కేసీఆర్ కు చేరింది. వెంటనే స్పందించింన  సీఎం కేసీఆర్ ..రైతుతో మాట్లాడారు.

అసలు విషయానికొస్తే..

మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని నదుల పల్లెకు చెందిన శరత్ అనే రైతు ,తన భూమిని VRO కరుణాకర్ తమ అనుమతి లేకుండా ఇతరుల పేరిట పట్టా చేసి అన్యాయం చేశారని తన ఆవేదనను ఓ వీడియో ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.  తన బాధ ను సీఎం కు చేరే వరకు  షేర్ చేయాలని కోరడంతో ..చాలా మంది ఈ రైతు బాధను షేర్ చేశారు. దింతో ఈ విషయం సీఎం కేసీఆర్ కు చేరడంతో స్పందించి, రైతుతో స్వయంగా పోన్ లో మాట్లాడారు. రైతు నుండి వివరాలు సేకరించిన సీఎం.. మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోల్లికెరీతో మాట్లాడారు. సదరు రైతుకు సంబంధించిన వివరాలు సేకరించి, తనకు పంపాలని , అదే విధంగా ఆ రైతుకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ ను సీఎం ఆదేశించారు.  దింతో జిల్లా కలెక్టర్ హుటాహుటిన నెన్నెల తహసీల్దార్ కార్యాలయం, వెళ్లి రికార్డులను పరిశీలించి నందుల పల్లి గ్రామానికి వెళ్లి రైతుతో మాట్లాడి వివరాలు సేకరించారు. సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ప్రస్తుతం కేసీఆర్ రైతుతో మాట్లాడిన ఫోన్ రికార్డ్ ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

 

Latest Updates