సాయంత్రం గోదావరిఖనిలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ (సోమవారం) సాయంత్రం గోదావరిఖనిలో TRS బహిరంగసభ నిర్వహించనుంది. సాయంత్రం 4 గంటలకు డిగ్రీ కాలేజీ గ్రౌండ్ లో జరిగే ఈ సభకు  సీఎం కేసీఆర్‌ హాజరుకానున్నారు. దీనికి సంబంధించి ఆ పార్టీ నాయకులు సభ ఏర్పాట్లను దగ్గరుండి మరీ పరీక్షిస్తున్నారు. పెద్దపల్లి ఎంపీ స్థానం పరిధిలోని పెద్దపల్లి, ధర్మపురి, రామగుండం, మంథని, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల నుంచి భారీగా జనసమీకరణ చేస్తున్నారు.

Latest Updates