తెలంగాణకు వచ్చేది రూ.29 వేల కోట్లు

ఇక గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఫైనాన్స్​కమిషన్​ గ్రాంట్లు, విపత్తుల నిర్వహణ సాయానికి అందించే గ్రాంట్లు వేరుగా విడుదలవుతాయి. ఇవిగాకుండా కేంద్ర స్కీమ్​ల అమలుకు సంబంధించి ఈసారి రూ.8,396 కోట్లు వస్తాయని ఆర్థిక శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా అన్నీ కలిపి కేంద్రం నుంచి రూ.29,034 కోట్లు వస్తాయని లెక్కలు వేస్తున్నాయి.

ఆ ఆశలు నెరవేరలే..

రాష్ట్ర ప్రభుత్వం కొన్నేండ్లుగా అడుగుతున్న కోరికలను కేంద్రం ఈసారి కూడా పక్కన పెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని, మిషన్‌‌ భగీరథ, మిషన్​ కాకతీయలకు నిధులివ్వాలని, జలశక్తి మిషన్​ నిధులను మిషన్​ భగీరథకు మళ్లించాలని రాష్ట్ర సర్కారు పలుమార్లు కేంద్రానికి లేఖలు రాసింది. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు, కాజీపేట రైల్వే డివిజన్‌‌, వ్యాగన్‌‌ కోచ్‌‌ ఫ్యాక్టరీ ఏర్పాటు, రాష్ట్రానికి పసుపు బోర్డు, కాకతీయ మెగా టెక్స్‌‌టైల్‌‌ పార్కుకు నిధులు, కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు, రాష్ట్రానికి ఇండియన్‌‌ ఇనిస్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ (ఐఐఎం), ఇండియన్‌‌ ఇనిస్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ సైన్స్‌‌ ఎడ్యుకేషన్‌‌ అండ్‌‌ రీసెర్చ్‌‌ (ఐఐఎస్‌‌ఈఆర్‌‌) మంజూరు, జిల్లాకో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు వంటి డిమాండ్లలో ఏవీ నెరవేరలేదు.

కేంద్రానిది చేతగానితనం
కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యా యం జరిగింది . బడ్జెట్ ప్రతిపాదనలు పూర్తి నిరాశాజనకంగా ఉన్నాయి. కేంద్రం పన్నుల వాటా తగ్గిం చడం వల్ల రాష్ ట్ర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కొరత వస్త ుంది . దాని ప్రభావం అభివృద్ధిపైనా పడుతుంది . కేంద్ర సర్కారు అసమర్థత వల్లే రాష్ట్రాలకు పన్నుల వాటా తగ్గింది . జీఎస్టీ అమల్లో కేంద్రం విఫలమైంది . దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే చర్యలేవీ బడ్జెట్ లో చేర్చలేదు. – సీఎం కేసీఆర్

మరిన్ని వెలుగు వార్తలకోసం క్లిక్ చేయండి

Latest Updates