కాళేశ్వరం పవర్ ప్లాంట్లపై సీఎం కేసీఆర్ రివ్యూ

kcr-reviews-on-kaleshwaram-power-plant227078-2

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో అధికారులతో సమావేశం అయ్యారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ అవసరాలపై అధికారులతో చర్చలు జరిపారు సీఎం కేసీఆర్. ప్రాజెక్టుకు అనుసంధానంగా పవర్ ప్లాంట్ల ఏర్పాటు.. విద్యుదుత్పత్తి చేయడంపై చర్చించారు.

మల్లన్న సాగర్ కు నీటిని పంపింగ్ చేసేందుకు 134 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంది. దీంతో ఇప్పటికే అక్కడ 400 కెవి సబ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. రంగనాయక సాగర్ దగ్గర 110 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసేందుకు 539 మెగావాట్ల విద్యుత్ అవసరముంది. ప్రతిదగ్గర 400 కేవీ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. వీటన్నింటిపై చర్చించారు సీఎం. ఏఏ ఎత్తిపోతల దగ్గర ఎంత విద్యుత్ అవసరం ఉంది.. సబ్ స్టేషన్ల నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయనే అంశాలపై విద్యుత్ ఉన్నతాధికారులతో చర్చించారు సీఎం.

Latest Updates