నవంబర్ 2 నుంచే రిజిస్ట్రేషన్లు ప్రారంభం

రాష్ట్రంలో నవంబర్ 2 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయన్నారు సీఎం కేసీఆర్. మూడు చింతల పల్లిలో ధరణి పోర్టల్ ను ప్రారంభించిన కేసీఆర్.. ఇవాళ్టి నుంచే స్లాట్ బుక్ చేసుకోవచ్చన్నారు.  రైతులు స్లాట్ బుక్ చేసుకుని భూమి అమ్ముకోవచ్చు.. కొనుకోవచ్చన్నారు. రిజిస్ట్రేషన్ ఫీజు మ్యుటేషన్ ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవచ్చన్నారు. పావుగంటలోనే రిజిస్ట్రేషన్,మ్యుటేషన్ పూర్తవుతుందన్నారు. భూమి అమ్మినా.. కొనుగోలు చేసినా.. కొన్ని గంటలలొనే ధరణి లొనే అప్డేట్ అవుతుందన్నారు. అసలు భూమి లేని వారు భూములు కొనుగోలు చేస్తే వారు కొన్ని డబ్బులు చెల్లిస్తే కొత్త పాసు పుస్తకం ప్రభుత్వం ఇస్తుందన్నారు. జిల్లాకు ఒక టెక్నీకల్ టీమ్ ను ఏర్పాటు చేసామని…వారి ఏదయినా సమస్య వస్తే పరిష్కారిస్తారన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటుగా 570 తహసిల్దార్  ఆఫీసుల్లో  కూడా రిజిస్ట్రేషన్ లు మ్యుటేషన్ లు చేసుకోవచ్చన్నారు కేసీఆర్.

ధరణి పోర్టల్ దేశంలోనే ట్రెండ్ సెట్టర్

Latest Updates