స్టూడియో నిర్మాణానికి డైరెక్టర్ శంకర్ కు ఐదెకరాల భూమి

సీఎం కేసీఆర్ కు కృతజ్ఞ‌త‌లు తెలియజేశారు డైరెక్టర్ శంకర్. తెలంగాణలో సినిమాను అభివృద్ధి చేయడంలో భాగంగా సినీ స్టూడియో నిర్మాణానికి ఐదెకరాల భూమిని డైరెక్టర్ శంకర్ కు కెటాయించారు కేసీఆర్. ఈ భూమి హైదరాబాద్ శివారు ప్రాంతమైన శంకర్ పల్లిలోని మోకిల్ల‌ అనే గ్రామ పరిదిలోకి వస్తుంది.

ప్రత్యేక రాష్ట్ర సాకారంలో భాగంగా.. ‘జై బోలో తెలంగాణ’ సినిమాను తెరకెక్కించి ఉద్యమంలో తన వంతు పిడికిలి బిగించారు శంకర్. నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో శంకర్ కు భూమిని కెటాయిస్తున్నట్లు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో బుధవారం సీఎం ను శంకర్ కలిసి శాలువాతో సత్కరించి కృతజ్ఞ‌త‌లు తెలియజేశారు.

Latest Updates