కేసీఆర్ సర్కార్ అంతా మోసాలమయం

ఆల్విన్ కాలనీ: సీఎం కేసీఆర్ ఆరున్నరేండ్ల పాలనలో అందరినీ మోసం చేశారని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఆల్విన్ కాలనీలో బీజేపీ రోడ్ షోకు అర్వింద్ హాజరయ్యారు. ఈ ర్యాలీకి బీజేపీ కార్యకర్తలు, నేతలతోపాటు ప్రజలు భారీగా తరలివచ్చారు. ర్యాలీలో భాగంగా అర్వింద్ మాట్లాడుతూ.. కేసీఆర్ అందరినీ మోసం చేశారన్నారు. అందరికంటే ఎక్కువగా పోలీసులను మోసం చేశారని విమర్శించారు.

‘ఎల్ఆర్ఎస్ తెచ్చింది కేసీఆరే. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కట్టిస్తానని పేద ప్రజలను మోసం చేసిందీ కేసీఆరే. వరద బాధితులకు రూ.10 వేలు ఇవ్వకుండా మోసం చేసిందీ కేసీఆర్ ప్రభుత్వమే. ఆరోగ్య శ్రీ పథకం తెలంగాణలో లేదు. అగ్రవర్ణ పేదలకు ప్రధాని మోడీ రిజర్వేషన్ ఇస్తే.. కేసీఆర్ తీసుకురావడం లేదు. మీడియా వాళ్లకు ఇంత వరకు ఇండ్లు ఇవ్వలేదు. కమీషన్లు ఫౌమ్ హౌస్‌‌కు పోతున్నాయి. రీన్ గాళ్లకు ఆధార్ కార్డ్ ఇస్తరంట. బంగ్లాదేశ్, పాకిస్తాన్‌‌లో 30 శాతంగా ఉన్న హిందువుల జనాభా కాస్తా 3 శాతానికి పడిపోయింది. రీన్ గాళ్లు వస్తే అందరినీ తరిమేస్తారు’ అని అర్వింద్ పేర్కొన్నారు.

Latest Updates