కేసీఆర్ దుబ్బాకకు వచ్చి ప్రజలకు నిజాలు చెప్పాలి

వరంగల్ జిల్లాలో మీటింగ్ పెట్టుకొని దుబ్బాక ఉప ఎన్నిక పై మాట్లాడిన సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. దుబ్బాకకు వచ్చి ప్రజలకు వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు. దుబ్బాకలో నిర్వహించిన ప్రెస్ మీట్ మాట్లాడిన ఆమె…కేసీఆర్ కు దుబ్బాక వచ్చేందుకు మొఖం లేదా అని ప్రశ్నించారు. ఓడిపోతమని భయమా అని అన్నారు.

మంత్రి హరీష్ రావు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జూటా పార్టీ బీజేపీ కాదు.. హరీష్, ఆయన మామ జూటాలన్నారు. తెలంగాణ అంటే గజ్వేల్, సిద్దిపేట సిరిసిల్లాలేనా..తెలంగాణలో ఇంకా గ్రామాలు లేవా అని అన్నారు. హరీష్ కు ఇవాళ దుబ్బాక గుర్తొచ్చిందా అని అన్నారు. రెండు సార్లు మంత్రి అయినా… అప్పుడు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఉప ఎన్నికలు వచ్చాయీ కాబట్టి ఇప్పుడు దుబ్బాకపై పై ప్రేమ  పుట్టుకొచ్చిందా అని అన్నారు. రైతుల మోటార్ల కు  మీటర్లు బీజేపీ పెడుతుందని మంత్రి హరీశ్ రావు చెప్పడం పచ్చి అబద్ధమన్నారు. అసలు విద్యుత్ బిల్లు కాపీ చూసినవా హరీష్ రావు అని అడిగారు డీకే అరుణ. టీఆర్ఎస్ కు ఓటువేసి మోసపోకుండా..బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

Latest Updates