కాసేపట్లో మిర్యాలగూడ, మల్కాజిగిరిల్లో KCR సభలు

రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో మరింత హీట్ పెరగనుంది. ఇప్పటికే కరీంనగర్, నిజామాబాద్ లో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండు బహిరంగ సభలు నిర్వహించిన కేసీఆర్ ఇవాళ రెండు సభల్లో పాల్గొనున్నారు. కాసేపట్లో మిర్యాలగూడలో జరిగే  నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ మీటింగ్ కు హాజరవుతారు.

ఆ తర్వాత  సాయంత్రం 5.30 గంటలకు ఎల్బీ స్టేడియంలో జరిగే మల్కాజ్ గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్ ఎంపీ నియోజకవర్గాల బహిరంగసభలో పాల్గొంటారు. సభ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు జిల్లాల నేతలు.

ఎండాకాలం కావడంతో కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు నేతలు. వాటర్, మజ్జిగ ప్యాకెట్లు సిద్దంగా ఉంచారు.

ఏప్రిల్ 4 వరకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా వరుసగా టీఆర్ఎస్ బహిరంగ సభలు నిర్వహిస్తోంది. మార్చి 31న నాగర్ కర్నూలు నియోజకవర్గ సభను వనపర్తిలో పెడుతున్నారు. అదేరోజు సాయంత్రం మహబూబ్ నగర్ లో మరో సభ ఉంటుంది. ఏప్రిల్ ఒకటో తేదీ రామగుండంలో, రెండున వరంగల్, బువనగిరిలో సభలు ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 3న ఆందోల్, నర్సాపూర్ లో సభలు ఉంటాయి. ఏప్రిల్ నాలుగున ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ స్థానలకు సంబంధించి సభలు ఉంటాయి.

Latest Updates