తెలంగాణలో టెస్టులు ఎక్కువ చేస్తున్నం

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలో కరోనా టెస్టులు బాగా పెంచామని, పాజిటివ్ వచ్చిన వాళ్లకు మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఐసీఎంఆర్, నీతిఆయోగ్, కేంద్ర టీమ్లు, ఎక్స్ పర్టుల సలహాలను పాటిస్తున్నామని.. పేషెంట్లకు అవసరమైన బెడ్లు, మందులు సిద్ధంగా ఉంచామన్నారు.రాష్ట్రంలో హెల్త్, పోలీసు, ఇతర యంత్రాంగమంతా శక్తివంచన లేకుండా పనిచేస్తోందని పేర్కొన్నారు. దేశంలో కరోనా ఎక్కువగా ఉన్నపది రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ నిర్వహించి న వీడియో కాన్ఫరెన్స్లో కేసీఆర్మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిని, కట్టడి కోసం తీసుకున్న చర్యలను ప్రధానికి వివరించారు. తెలంగాణలో రికవరీ రేటు 71 శాతంగా ఉందని.. మరణాలు రేటు 0.7 శాతం మాత్రమే ఉందని తెలిపారు.

మెడికల్ కాలేజీలు పెంచాలి

కరోనా వంటి వైరస్‌లు భవిష్యత్తులోనూ వచ్చే అవకాశం ఉందని.. అలా ఎన్ని వచ్చినా తట్టుకునేలా వైద్య రంగం తయారు కావాలని ప్రధాని మోడీని సీఎం కేసీఆర్‌ కోరారు. ఆ దిశగా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో హెల్త్ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలని.. జనాభాకు తగిన ట్టుగా డాకర్ట్లసంఖ్యను పెంచాలని అన్నారు. పెద్ద సంఖ్యలో మెడికల్‌ ‌‌‌కాలేజీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, ఐఎంఏ వంటి సంస్థలతో సంప్రదించి తగిన చర్యలు చేపట్టాలని చెప్పారు. హెల్త్ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుపై ప్రణాళికలు సిద్ధం చేయాలని.. కేంద్రం , రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేసి సదుపాయాలు పెంచాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌లో హెల్త్మినిస్టర్ ఈటల రాజేందర్, ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్‌ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Latest Updates