రేపు బాన్సువాడకు సీఎం కేసీఆర్

కామారెడ్డి: సీఎం కేసీఆర్ గురువారం బాన్సువాడ మండలం పోచారం గ్రామానికి వెళ్లనున్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌ రెడ్డిని సీఎం కేసీఆర్ పరామర్శించనున్నారు. పోచారం తల్లి పాపవ్వ(107) మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలు బుధవారం జరిగాయి. దీంతో సీఎం కేసీఆర్ పోచారం వెళ్లి స్వర్గీయ పాపవ్వ చిత్రపటానికి నివాళులర్పించి.. శ్రీనివాస్‌రెడ్డిని పరామర్శించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో బాన్సువాడకు చేరుకుంటారు.

Latest Updates