ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియల్లో పాల్గొననున్న సీఎం

నల్లగొండ: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (64) అంత్యక్రియల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. మంగళవారం హైదరాబాద్‌లో గుండెపోటుతో కన్నుమూసిన ఎమ్మెల్యే నోముల భౌతికకాయాన్ని నార్కెట్‌పల్లి కామినేని ఆసుపత్రిలో భద్రపరిచారు. బుధ‌వారం రాత్రికి అమెరికా నుంచి ఆయన చిన్న కూతురు జ్యోతి రానున్నారు. నోముల స్వగ్రామమైన నకేరేకల్ మండలం పాలెం గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Latest Updates