అపెక్స్ మీటింగ్ వాయిదా పడితే నీళ్లొదులుకున్నట్లే…

  • జల వివాదాలపై భేటీ ఇప్పుడొద్దన్న కేసీఆర్
  • 20వ తేదీ తర్వాత పెట్టాలంటూ కేంద్రానికి లెటర్
  • 19వ తేదీనే పోతిరెడ్డి పాడు టెండర్లు ఫైనల్
  • ఆ తర్వాత అపెక్స్ మీటింగ్ నిర్వహిస్తే ఏం లాభం?
  • ఇదంతా ఎవరి ప్రయోజనాల కోసమని అంతటా చర్చ
  • ఏపీ దోపిడీని అడ్డుకునే చాన్స్ ను చేజార్చుకున్నట్టే అంటున్న ఇంజనీర్లు
  • కేంద్రం తోడ్పాటు అందిస్తున్నా పట్టించుకోకపోవడంపై విస్మయం

శ్రీశైలం నీళ్లన్నీ తోడుకునేలా ఏపీ అక్రమంగా చేపడ్తున్న పోతిరెడ్డిపాడు విస్తరణ, సంగమేశ్వరం ప్రాజెక్టులను తెలంగాణ సర్కారు తెర వెనుక సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఏపీ ప్రాజెక్టులను అడ్డుకోవాలంటూ నామ్కేవాస్తేగా కృష్ణాబోర్డుకు ఓ లెటర్​రాసి.. మరోవైపు ఆ ప్రాజెక్టుల టెండర్లకు లోలోపల వత్తాసు పలుకుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై కేంద్రం ఏర్పాటు చేసిన అపెక్స్​కౌన్సిల్ మీటింగ్​ను వాయిదా వేయాలని స్వయంగా సీఎం కేసీఆర్ కోరడం డిస్కషన్ ​పాయింట్ గా మారింది. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 5న అపెక్స్​కౌన్సిల్ భేటీ జరగాల్సి ఉంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో పాటు ఇరు రాష్ట్రాల సీఎంలు ఆ మీటింగ్​లో పాల్గొనాల్సి ఉంది. అందులో ఏపీ చేస్తున్నజల దోపిడీని తెలంగాణ సర్కారు ఎండగడుతుందని.. పోతిరెడ్డిపాడును అడ్డుకుంటుందని అందరూ ఆశించారు. ఉద్యమ సమయంలో పోతిరెడ్డిపాడు గండిపై నిప్పులు చెరిగిన ఇరిగేషన్ ఇంజనీర్లుఇదే అభిప్రాయంవ్యక్తంచేశారు. కానీ ఇప్పుడు ‘అపెక్స్​కౌన్సిల్​​తో వసరమేముంది? ఆ మీటింగ్​ వాయిదా వేయాలంటూ’ కేంద్రానికి లెటర్​రాయాలని కేసీఆర్ ​అధికారులను ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. అఫీషియల్ప్రోగ్రాంలతో బిజీగా ఉన్నందున ఈ నెల 20వతేదీ తర్వాత అపెక్స్​మీటింగ్ నిర్వహించాలని సీఎం కేసీఆర్ కోరారు. ఎంత బిజీగా ఉన్నా వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా గంటా, రెం డు గంటలు జరిగే ఈ మీటింగ్ను దాటవేయడం ఎందుకు?, మన నీళ్లను ఏపీ దోచుకుంటే అడ్డుకునేందుకు తొందరపడాల్సింది పోయి మన సర్కారు ఎందుకు లేట్ చేస్తోంది.. ఇదంతా ఎవరి ప్రయోజనాల కోసం అన్నది ఆసక్తికరంగా మారింది.

టెండర్ల కోసమే వాయిదా!

శ్రీశైలంలో చుక్క నీళ్లు మిగలకుండా ఏపీ సర్కారు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీని డబుల్ చేయటంతో పాటు కొత్తగా సంగమేశ్వరం లిఫ్ట్  పెట్టింది. రోజుకు 8 టీఎంసీల నుంచి పది టీఎంసీల కృష్ణా నీళ్లను తరలించేందుకు పక్కా స్కెచ్ వేసింది. జులై 15వ తేదీనే ఈ పనులకు టెండర్లు పిలిచింది. సరిగ్గా ఆగస్టు 19నాటికి టెండర్లు ఫైనల్ అవుతాయి. కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్టే ప్రాసెస్ మొత్తం పూర్తవుతుంది. మరోవైపు కేసీఆర్ కోరినట్టు 20వ తేదీ తర్వాతికి అపెక్స్​మీటింగ్ వాయిదా వేస్తే.. ఏపీ టెండర్లప్రక్రియ అయిపోతుందని, అప్పుడు అడ్డు చెప్పినా చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టే అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ ప్రాజెక్టుల టెండర్లుఆగకుండా ఇద్దరు సీఎంల అండర్ స్టాండింగ్ తోనే అపెక్స్​మీటింగ్ను దాట వేస్తున్నారని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో పోతిరెడ్డిపాడు నుంచి నాలుగు టీఎంసీల నీటిని తరలిస్తే ఉద్యమాన్ని రాజేసిన టీఆర్ఎస్నేతలు.. ఇప్పుడు అంతకు డబుల్ గండి కొడుతుంటే పట్టించు కోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మనకు రావాల్సిన నీళ్లను ఏపీ మళ్లించు కుపోతుంటే కొట్లాడాల్సింది పోగా..అందివచ్చిన అపెక్స్​కౌన్సిల్ అవకాశాన్ని కూడా సర్కారు జారవిడుచుకుంటోందని ఇరిగేషన్ ఆఫీసర్లు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే శ్రీశైలం నీళ్లు చుక్కాకూడా కిందికి రావని, దక్షిణ తెలంగాణతోపాటు హైదరాబాద్ తాగునీటికి కూడా కటకట తప్పని పరిస్థితిపై ‘వీ6 వెలుగు’ వరుసగా స్టోరీలను ప్రచురిస్తోంది. ఈ వరుస కథనాలతో కదిలిన సర్కారు.. ఏపీ జీవో ఇచ్చిన ఆరు రోజుల తర్వాత నామ్కేవాస్తేగా రివ్యూ నిర్వహించింది. ఆ తర్వాత రెండుసార్లు కృష్ణా బోర్డుకు లెటర్ రాయడం తప్ప ఒక్కటంటే ఒక్క గట్టి చర్య కూడా చేపట్టలేదు.

అనుమతుల్లేకున్నా సైలెంట్

ఏపీ సర్కారు తల పెట్టిన పోతిరెడ్డిపాడు విస్తరణ, సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్​స్కీంలు పూర్తిగా కొత్తవి. ఏపీ రీఆర్గనై జేషన్ యాక్ట్ ప్రకారం రెండు రాష్ట్రాల్లో ఏ కొత్త ప్రాజెక్టు చేపట్టినా దానికి సంబంధిత రివర్ బోర్డు, సెంట్రల్ వాటర్ కమిషన్ టెక్నికల్ అప్రై జల్ తోపాటు అపెక్స్ కౌన్సిల్ పర్మిషన్ తప్పనిసరి. ఇవేవీ లేకుండానే ఏపీ సర్కారు కొత్త ప్రాజెక్టులకు టెండర్లుపిలిచిం ది. దీనిపై నిలదీసి ఏపీని కట్టడిచేయాల్సిన మన సర్కారు.. ఆ బాధ్యతను పూర్తిగా విస్మరించిందనే విమర్శలు వస్తున్నాయి.కేంద్రం అడిగినా పట్టింపు లేదు దక్షిణ తెలంగాణకు తీవ్ర నష్టం చేకూర్చేలా ఉన్న ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి శాఖనే జోక్యం చేసుకొని ఏపీని కట్టడి చేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది. కేంద్రం ఆదేశాల మేరకు ఈ ప్రాజెక్టుల విషయంలో ముందుకెళ్లొ ద్దని కృష్ణా బోర్డు ఇప్పటికే రెండు సార్లు ఏపీని ఆదేశించింది. ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాలు పరిష్కరించేందుకు అపెక్స్ కౌన్సిల్ నిర్వహిస్తామని ఈ ఏడాది జనవరి నుంచి కేంద్రం సమాచారమిస్తూనే ఉంది. అయినా ఇప్పటికీ రెండు రాష్ట్రా లు ఎజెండా ఇవ్వలేదు. మరోవైపు బోర్డు ఆదేశాలను లెక్క చేయకుండా ఏపీ ప్రాజెక్టుల టెండర్ల పనిని స్పీడప్ చేసింది. అదే టైంలో రాష్ట్ర సర్కారు సైలెంటవడం వాళ్లకు కలిసొచ్చినట్లయింది.

కేంద్రం అడిగినా పట్టింపు లేదు

దక్షిణ తెలంగాణకు తీవ్ర నష్టం చేకూర్చేలా ఉన్న ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి శాఖనే జోక్యం చేసుకొని ఏపీని కట్టడి చేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది. కేంద్రం ఆదేశాల మేరకు ఈ ప్రాజెక్టుల విషయంలో ముందుకెళ్లొ ద్దని కృష్ణా బోర్డు ఇప్పటికే రెండు సార్లు ఏపీని ఆదేశించింది. ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాలు పరిష్కరించేందుకు అపెక్స్ కౌన్సిల్ నిర్వహిస్తామని ఈ ఏడాది జనవరి నుంచి కేంద్రం సమాచారమిస్తూనే ఉంది. అయినా ఇప్పటికీ రెండు రాష్ట్రా లు ఎజెండా ఇవ్వలేదు. మరోవైపు బోర్డు ఆదేశాలను లెక్క చేయకుండా ఏపీ ప్రాజెక్టుల టెండర్ల పనిని స్పీడప్ చేసింది. అదే టైంలో రాష్ట్ర సర్కారు సైలెంటవడం వాళ్లకు కలిసొచ్చినట్లయింది.

Latest Updates