కేసీఆర్ ప్రాణం చినజీయర్ చేతిలో ఉంది : రాములు నాయక్

సీఎం కేసీఆర్ కు తెలంగాణ ఉద్యమంలో దేవుళ్లలాగా కనపడ్డ ఆర్టీసీ కార్మికులు.. ఇప్పుడు రాక్షసుల్లాగా కనపడుతున్నారా అని మాట్లాడారు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్. హైకోర్ట్ లో ఓడిపోతాననే కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్తానని చెప్పారన్నారు. కేసీఆర్ మొండివాడు కాదు చాలా బయస్థుడన్న ఆయన..కేబినెట్ సమావేశంలో ఏమీ ఉండదన్నారు. కేసీఆర్  చెప్పింది పేపర్ మీద రాసుకొని రావాలని తెలిపారు. పువ్వడా అజయ్ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక్కరు కూడా డ్రైవర్, కండక్టర్ లు లేరని.. అజయ్ కి SC, ST, BC ల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా పదవికి రాజీనామా చేసి ఆర్టీసీ ఉద్యమానికి సపోర్ట్ గా నిలబడాలన్నారు.

కేసీఆర్ ప్రాణం చినజీయర్, మై హోమ్ రామేశ్వర రావు, మేఘా కృష్ణారెడ్డి చేతిలో ఉందన్న రాములు.. అందుకే  వాళ్ళ ఇంటి దగ్గర నిరసన కార్యక్రమాలు చేస్తే కేసీఆర్ స్పందిస్తాడన్నారు. ఇలాంటి తెలంగాణ వస్తది అనుకుంటే అప్పుడే సైనెడ్ వేసుకొని చనిపోయేవాళ్ళమని తెలిపారు రాములు నాయక్.

 

Latest Updates