కేదారి నాథ్ టెంపుల్ లో పూజలు

డెహ్రాడూన్ : కేదారినాథ్ టెంపుల్ ద్వారాలను ఇవ్వాళ ఉదయం తెరిచారు. కరోనా కారణంగా ప్రస్తుతానికి భక్తులను అనుమతించమని ఆలయ నిర్వాహకులు తెలిపారు. రోజు ప్రధాన పూజారి ఆధ్వర్యంలో పూజాలు కొనసాగించనున్నారు. తొలి రోజు ప్రధాని మోడీ తరఫున మహాశివునికి రుద్రాభిషేకం నిర్వహించారు. పూజా సమయంలో ఫిజికల్ డిస్టెన్స్ మెయింటెన్ చేశారు. ఆలయం తెరిచిన తర్వాత భక్తులు లేకపోవటం ఇదే తొలిసారి. కేదారి నాథ్ టెంపుల్ తలుపులు తీసేటప్పటికే వందల సంఖ్యలో భక్తులు క్యూ లో ఉంటారు. కరోనా ఎఫెక్ట్ తో ఈ సారి భక్తులెవరు రాలేదు. ఇప్పటికే గంగోత్రి, యమునోత్రి ద్వారాలు తీశారు. మే 15 బద్రీనాథ్ టెంపుల్ తలుపులు కూడా తెరవనున్నారు. కరోనా ఎఫెక్ట్ పూర్తైన తర్వాతే చార్ ధామ్ యాత్రను కొనసాగించనున్నారు.

Latest Updates