6 నెలల తర్వాత తెరుచుకున్న కేదార్ నాథ్ ఆలయం

ఉత్తరాఖండ్ : చార్ ధామ్ యాత్రలో ఒకటైన కేదార్ నాథ్ పుణ్యక్షేత్రం తెరచుకుంది.  ఉదయం 5 గంటల 33 నిమిషాలకు కేదార్ నాథ్ ఆలయాన్ని తెరిచారు. ఆరు నెలల తర్వాత ఆలయంలో అధికారులు, పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించారు. చార్ ధామ్ యాత్రలో భాగమైన గంగోత్రి పుణ్యక్షేత్రాన్ని నిన్న ఉదయం 11 గంటలకు తెరిచారు. యమునోత్రిని మధ్యాహ్నం ఒంటి గంటకు ఓపెన్ చేశారు. బద్రీనాథ్ ను రేపు తెరవనున్నారు పూజారులు. 6 నెలల పాటు చార్ థామ్  పుణ్య క్షేత్రాల్లో భక్తుల సందడి నెలకొంది.

Latest Updates