హాంకాంగ్‌పై చైనా తీరును నిశితంగా గమనిస్తున్నాం: ఇండియా

జెనీవా: హాంకాంగ్‌పై నేషనల్ సెక్యూరిటీ లాను బలవంతంగా రుద్దుతున్న చైనా చర్యలను నిశితంగా గమనిస్తున్నామని యునైటెడ్ నేషన్స్‌లో ఇండియా తెలిపింది. ఇండియన్ కమ్యూనిటీకి చెందిన వారి సంఖ్య ఎక్కువగా ఉన్న హాంకాంగ్ పరిణామాలను నిష్పాక్షికంగా పరిష్కరించాలని ఐక్యరాజ్య సమితిని ఇండియా కోరింది. కొత్త చట్టం వల్ల హాంకాంగ్ వాసుల స్వేచ్ఛను చిదివేసే ప్రమాదం ఏర్పడిందని, స్వయం ప్రతిపత్తిని దెబ్బ తీస్తున్నాయని భయాందోళనలు నెలకొన్నాయి. దీనిపై యూఎన్‌లో ఇండియా అంబాసిడర్, శాశ్వత ప్రతినిధి రాజీవ్ కే చందర్ మాట్లాడారు.

‘స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్ ఆఫ్ చైనా అయిన హాంకాంగ్‌లో ఇండియన్ కమ్యూనిటీకి చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. అందువల్ల అక్కడ జరుగుతున్న తాజా పరిణామాలను ఇండియా నిశితంగా గమనిస్తోంది. ఈ విషయాల గురించి పలువురు వ్యక్తం చేసిన ఆందోళనలు మా దృష్టికి వచ్చాయి. వీటిని సంబంధిత పార్టీలు పరిగణనలోకి తీసుకొని సరైన రీతిలో, నిష్పాక్షికంగా పరిష్కరిస్తాయని ఆశిస్తున్నాం’ అని రాజీవ్ పేర్కొన్నారు.

Latest Updates