ప్రియాంక హత్యపై కీర్తిసురేష్ రియాక్షన్

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రియాంక రెడ్డి హత్య కేసుపై సినీ నటి కీర్తి సురేశ్  స్పందించారు.  ‘‘ప్రియాంకారెడ్డి వార్త వినగానే మనసు కదిలిపోయింది. రోజురోజుకీ పరిస్థితులు భయానకంగా తయారవుతున్నాయ్. నేనిన్నాళ్లూ సురక్షితమైన నగరంగా భావించిన హైదరాబాద్‌‌లో ఇలా జరిగిందంటే ఏం మాట్లాడాలో తెలియడం లేదు. మన దేశంలోని అమ్మాయిలు ఏ టైమ్‌ లో అయినా నిర్భయంగా తిరిగే రోజు ఎప్పుడొస్తుంది? ఇలాంటి సైకోగాళ్లం దరినీ వెంటనే వెతికి పట్టుకుని కఠినంగా శిక్షించాలి. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను.అది ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది.’’

Latest Updates