మిస్ ఇండియా ట్రైలర్: ‘మిస్ ఇండియా’ అంటే నేను కాదు.. ఒక బ్రాండ్

‘మిస్ ఇండియా’గా రాబోతున్న మహానటి

‘మహానటి’ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న కీర్తి సురేష్.. తాజాగా ‘మిస్ ఇండియా’గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నరేంద్రనాథ్ దర్శకత్వంలో మహేష్ కోనేరు నిర్మాతగా రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. బిజినెస్ చేయాలనుకునే అమ్మాయికి తన ఇంట్లో నుంచే వ్యతిరేకత మొదలవడంతో.. వారిని ఒప్పించి వ్యాపారంలోకి అడుగుపెడుతుంది. అలా బిజినెస్‌లోకి వచ్చిన అమ్మాయికి.. వ్యాపార ప్రత్యర్థుల నుంచి ఎదురుదాడి మొదలవుతుంది. ఇండియాలో ఛాయ్ కున్న క్రేజీ అంతా ఇంతా కాదు. ఆ ఛాయ్ బిజినెస్‌ను ప్రారంభించిన కీర్తికి.. ప్రత్యర్థిగా స్టైలిష్ బిజినెస్‌మెన్‌ గెటప్‌లో జగపతిబాబు నటించారు. మహానటి సినిమాతో ఎంతో ఫేమస్ అయిన కీర్తి తదుపతి చిత్రం ఇదే కావడంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదరుచూస్తున్నారు.

థమన్ సంగీత దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలోని ఒక పాటను గతంలోనే విడుదల చేశారు. కొత్తగా కొత్తగా అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో కీర్తికి తల్లిగా నదియా, తండ్రిగా సీనియర్ నరేష్, అన్నగా కమల్ కామరాజు నటించారు. రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేకపాత్రలో నటించిన ఈ చిత్రంలో నవీన్ చంద్ర, జగపతిబాబు తదితరులు నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 17, 2020న విడుదల కావలసి ఉండగా.. కరోనా ప్రభావంతో వాయిదాపడింది. తాజాగా ఈ సినమాను నవంబర్ 4న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

For More News..

ఆర్మీ క్యాంటీన్స్‌లో విదేశీ మద్యం బంద్!

రాజకీయాలు తెలియని లీడర్​ నాయిని

దుబ్బాకలో సీఎం కేసీఆర్ ప్రచారం!

Latest Updates