ప‌నిత‌నం అంటే ఇదే మ‌రి: రూ.కోటీ 10 ల‌క్ష‌ల‌తో ఏసీబీకి అడ్డంగా దొరికిన ఎమ్మార్వో

కీస‌ర ఎమ్మార్వో నాగ‌రాజు ఏసీబీ అధికారుల‌కు అడ్డంగా దొరికిపోయారు. రాంపల్లి లో 28 ఎకరాల ల్యాండ్ సెటిల్మెంట్లు విష‌యంలో పెద్ద మొత్తంలో లంచం తీసుకున్నారనే స‌మాచారం తో ఏసీబీ అధికారులు దాడులు జ‌రిపారు. 28 ఎకరాల ల్యాండ్ కు న్యూక్లియర్ చేసేందుకు రూ.కోటీ 10ల‌క్ష‌ల్ని రిల‌య‌ర్ట‌ర్ల ‌నుంచి తీసుకుంటుండ‌గా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు. ఏఎస్ రావు న‌గ‌ర్ లో ఉన్న నాగ‌రాజు ఇంట్లో సోదాలు నిర్వ‌హించారు. ఈ సోదాల్లో భారీ ఎత్తున న‌గ‌దును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లంచం తీసుకునే స‌మ‌యంలో నాగ‌రాజుతో పాటు , రియల్ ఎస్టేట్ బ్రోకర్ శ్రీనాథ్ ,కన్నడ అంజి రెడ్డి లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Latest Updates