ఓటు హక్కు వినియోగించుకున్న కేజ్రీవాల్, రాహుల్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థానిక సివిల్ లైన్స్ పోలింగ్ సెంటర్ లో కేజ్రీవాల్ తో పాటు ఆయన కుటుంబసభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఔరంగజేబ్‌ రోడ్డులోని పోలింగ్‌ సెంటర్ లో ఆయన ఓటు వేశారు.

Latest Updates