కూలీలు స్వస్థలాలకు వెళ్లకండి

వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేయవద్దని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ విజ్ఞప్తి చేశారు. గుంపులుగా వెళ్లడం కారణంగా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండాలని కోరారు. లాక్‌డౌన్‌ కారణంగా ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, జార్ఖాండ్‌, రాష్ర్టాలకు చెందిన వలస కార్మికులు తిరిగి తమ ఇండ్లకు వెళ్లేందుకు నడక ప్రారంభించారు. దీని వల్ల వారి స్వస్థలాల్లో ఈ వైరస్ వ్యాపించే అవకాశం ఉంటుంది.

భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఢిల్లీ సీఎంగా తాను ఇప్పటికే విజ్ఞప్తి చేశామని కేజ్రీవాల్‌ తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం వలస కూలీలకు కావాల్సిన భోజనం, వసతి ఏర్పాటు చేసిందని, దేశ ప్రయోజనాలు కాపాడేందుకు ఎవరూ కూడా ఢిల్లీని వదిలి వెళ్లడానికి ప్రయత్నించవద్దని తెలిపారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా 21 రోజుల వరకు దేశవ్యాప్త లాక్ డౌన్‌ కొనసాగుతున్న క్ర‌మంలో కూలీల‌కు రిక్వెస్ట్ చేస్తున్న‌ట్లు తెలిపారు ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్.

Latest Updates