‘ఓనర్లు ఇంటి అద్దె అడగొద్దు’

కరోనా దెబ్బకు సకలం బంద్ అయింది. ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి. పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. దాంతో ఎవరూ ఇళ్లలోనుంచి బయటకు రాని పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రభావం మధ్య తరగతి, పేద వాళ్లపై గట్టిగా పడనుంది. రోజూ ఏదో ఒక పని చేస్తే కానీ ఇళ్లు గడవని పరిస్థితి వారందరిది. అలాంటి వారి గురించి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో ఇళ్ళు అద్దెకు ఇచ్చిన యజమానులకు  కేజ్రీవాల్ ఒక విజ్ఞప్తి చేశారు. ఓనర్లు ఇంటి అద్దె కోసం వేధించొద్దని ఆయన కోరారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో తమ తమ ఇళ్ళలో అద్దెకు ఉండే కిరాయిదార్ల నుండి ఇంటి యజమానులు బలవంతంగా అద్దె వసూలు చేయోద్దని ఆయన కోరారు. కరోనా వల్ల ఒకటి లేదా రెండు నెలలు ఆలస్యమైతే.. అద్దె కోసం వారిని బలవంత పెట్టొద్దని ఆయన సూచించారు. ఇంటి అద్దెను వాయిదాలలో వసూలు చేసుకొని పేదవారిని ఆదుకోవాలని ఇంటి యజమానులను ఆయన కోరారు. రాష్టంలో ఎవరూ ఆకలితో బాధపడకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన అన్నారు.

For More News..

లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్ కీలక సమావేశం

మలేషియా నుంచి చెన్నై చేరిన 113 మంది ఇండియన్లు

కరోనా కట్టడికి విరాళమిచ్చిన హీరో నితిన్

పరీక్షలు లేకుండా పైతరగతులకు పంపే యోచనలో ప్రభుత్వం

కరోనా దెబ్బకు మూతపడ్డ ప్రముఖ మొబైల్ ప్లాంట్

డీఎస్పీపై కేసు నమోదు.. ఫారెన్ నుంచి వచ్చిన కొడుకు విషయం దాచినందుకే..

కాలిఫోర్నియా బీచుల్లో జనం జల్సాలు

Latest Updates