మహిళల ఫ్రీ జర్నీపై ఇంత రచ్చా?: కేజ్రీవాల్ కౌంటర్

రిథాలా: ఢిల్లీ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి. మరికొన్ని రోజుల్లో శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే ఢిల్లీ సీఎం ఈ పథకం ప్రవేశపెట్టాడని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ విమర్శించారు. ఆ మాటలకు గట్టి కౌంటర్ ఇచ్చారు కేజ్రీవాల్. ఆదివారం జరిగిన ఓ మీటింగ్ లో కేజ్రీవాల్ మాట్లాడుతూ… తానేమీ ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి లా  రూ.191 కోట్లు ఖర్చు పెట్టి విమానం కొనలేదని,  అనవసర ఖర్చులకు పోకుండా..  తన సోదరీమణులకు సౌకర్యవంతమైన రవాణా సదుపాయం అందించాలన్న ఉద్దేశ్యంతోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్టు తెలిపారు.

మహిళలకు ఉచిత ప్రయాణం అనే ప్రభుత్వ పథకంపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని,  ప్రజా శ్రేయస్సు కోసం ప్రవేశపెట్టిన తన ప్రభుత్వ పథకాలపై ఆ పార్టీలు సంతోషంగా లేవని అన్నారు.

ప్రజల కోసం 200 యూనిట్ల వరకు  ఉచిత కరెంట్‌ను సరఫరా చేయడంపై ప్రతిపక్ష నాయకులు కొందరు వ్యతిరేకిస్తున్నారంటూ.. ఆ పార్టీ ఎంపీలు 4,000 యూనిట్ల వరకూ ఉచితంగా పొందుతారు, కానీ వారి కారు డ్రైవర్లకి ఉచితంగా ఇస్తే మాత్రం తెగ బాధపడి పోతారంటూ అరవింద్ కేజ్రీవాల్  కౌంటర్ ఇచ్చారు.

Kejriwal takes a 'Rs 191-crore plane' dig at Gujarat CM

Latest Updates