ముంబై కేఈఎం హాస్పిటల్‌లో సిబ్బంది ఆందోళన

  • స్టాఫ్‌లో ఒకరి మృతికి నిరసన
  • సిక్‌లీవ్‌ ఇవ్వకపోవడంతో చనిపోయాడని ఆరోపణ

ముంబై: మహారాష్ట్ర ముంబైలోని కేఈఎమ్‌ హాస్పిటల్‌లో మెడికల్‌స్టాఫ్‌ ఆందోళనకు దిగారు. పీపీఈ కిట్లు, మాస్కులు వేసుకుని అందరూ బయటకు వచ్చి ఆందోళన చేశారు. కరోనా వార్డులో పనిచేస్తున్న ఒక వ్యక్తి చనిపోయినందుకు నిరసన తెలిపారు. నాలుగు రోజులుగా అతనికి ఆరోగ్యం సరిగా లేదని, సెలవు అడిగిన ఇవ్వలేదని సిబ్బంది ఆరోపించారు. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి న్యాయం చేయాలని, పరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. తమకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని వారు ఆరోపించారు. బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న కేఈఎమ్‌ హాస్పిటల్‌ను కరోనా పేషంట్ల ట్రీట్‌మెంట్‌ కోసం ఉపయోగిస్తున్నారు. కాగా.. చనిపోయిన వ్యక్తికి కరోనా ఉందా అనే విషయం తెలియాల్సి ఉందని,రిజల్ట్‌ కోసం వెయిట్‌ చేస్తున్నామని అధికారులు చెప్పారు.

Latest Updates