కొండను చీల్చి రోడ్డేసిన రోజు కూలీ

kenya man builts road for his villagers
  • కెన్యాలో తన ఊరికి రోడ్డేసుకున్న ముచామి
  • ఆరు రోజుల్లో కిలోమీటరు రోడ్డు పూర్తి

దశరథన్ మాంఝీ గుర్తున్నారా?? 22 ఏళ్లు కష్టపడి 300 అడుగుల ఎత్తైన కొండను  చీల్చి గ్రామానికి రోడ్డేసుకు న్న బీహారీ. కెన్యాలోనూ అచ్చం ఇలానే ఓ వ్యక్తి తన గ్రామం కోసం రోడ్డేశాడు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో అతడే ఒంటి చేత్తో రోడ్డేసి హీరో అయ్యాడు.కెన్యాలోని కగండా గ్రామంలో ఉంటాడు నిలో లస్‌ముచామి. 45 ఏళ్లు. రోజు కూలీ. కష్టపడితే గానీ పూట గడవని పరిస్థితి. కగండా షాపింగ్‌ కాంప్లెక్స్‌‌ నుంచి తన ఊరికి ఓ కిలోమీటరు దూరం. అక్కడికి వెళ్లడానికి కొండ చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. ఊరోళ్లు చాలా కష్టపడేవారు. ఎన్నో రోజులుగా ఈ విషయాన్ని స్థానిక అధికారులకు చెబుతూనే ఉన్నారు. ఎవరూ పట్టించుకోలేదు. లోకల్‌ నాయకులకు విన్నవించుకున్నారు. అటువైపు రాలేదు. మీడియా ద్వారా కూడా చెప్పి చూశారు. ఎవరూకదల్లేదు. ఏళ్లు గడిచిపోయాయి. లాభం లేదనుకున్నాడు ముచామి. నడుం బిగించాడు. రోడ్డేశాకే కూలీకి పోదామని డిసైడయ్యాడు. పొద్దున ఆరుగంటల నుంచి సాయంత్రం ఆరు వరకు పనే పని. 6 రోజులు కష్టపడ్డాడు. ఊరికి రోడ్డేశాడు. ఊళ్లో నిపిల్లలు, మహిళలకు టైం ఆదా చేశాడు. ఇంకా కొంచెం పని మిగిలి ఉంది. అది పూర్తయ్యేంత వరకు తామే తిండి పెడతామన్నారు ఊరోళ్లు.

పట్టించుకుంటేగా

రోడ్డు గురించి ఏళ్లుగా సర్కారుకుచెబు తూనే ఉన్నాం . పట్టిం చుకుం టేగా.అందుకే నేనే రోడ్డేద్దా మని నిర్ణయించుకున్నా. ఆరు రోజుల్లో అయిపోయింది.ఇక చర్చికైనా, షాపింగ్‌ కైనా ఈజీగా వెళ్లొచ్చు  – ముచామి

Latest Updates