హర్యాణాలో కెన్యా యువతి గ్యాంగ్ రేప్…

kenya-woman-gang-raped-by-auto-driver-and-his-friend-in-gurgaon-haryana

కెన్యాకు చెందిన 23ఏళ్ల యువతిని గ్యాంగ్ రేప్ చేశారు దుండగులు. ఈ ఘటన హర్యాణా లోని గురుగ్రామ్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆటో డ్రైవర్ సదామ్, అతని ఫ్రెండ్ సంతోష్ తో కలిసి రేప్ చేసినట్లుగా చెప్పారు. సదరు యువతి టూరిస్ట్ వీసాతో ఢిల్లీకి వచ్చి అక్కడే నివసిస్తుంది. అయితే.. గురువారం తన ఫ్రెండ్స్ ను గురుగ్రామ్ లో కలవడానికి వెళ్లింది ఆ యువతి. దీంతో అక్కడే ఉన్న ఓ నైట్ క్లబ్ లో వీళ్లు కలుసుకున్నారు. ఆ తర్వాత… తిరిగి ఢిల్లీ వెళ్లేందుకు ఆ యువతి రెడీ అయ్యింది. అప్పుడు సమయం రాత్రి12 అవుతుంది.  ద్రోణాచార్య మెట్రో స్టేషన్ కు వెళ్లడానికి ఓ ఆటోను మాట్లాడుకుంది. ఆటోలో డ్రైవర్ సంద్దాంతో పాటు.. అతని ఫ్రెండ్ సంతోష్  ఉన్నట్లు చెప్పారు పోలీసులు.

ద్రోణా చార్యకు మెట్రో స్టేషన్ కు వెళ్లే ఆటోను సక్కగా…  షీత్లా కాలనీ లో అతను ఉండే రూంకు తీసుకెళ్లి రేప్ చేశారు సద్దాం, సంతోష్.  ఎలాగో వారినుంచి తప్పించుకున్న సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సద్దాం, సంతోష్ ను పట్టుకున్నారు పోలీసులు. ఆ మహిళను వైద్య పరీక్షలకోసం హాస్పిటల్ కు తీసుకెళ్లారు.

Latest Updates