ఫిరాయింపులకు కేరాఫ్​ మోడీ, కేసీఆర్ : యోగేంద్ర యాదవ్

ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌‌ ఫిరాయింపులకు కేరాఫ్‌‌ అడ్రస్‌‌గా మారారని స్వరాజ్ అభియాన్ ఇండియా పార్టీ అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్‌‌ విమర్శించారు. తెలంగాణ, కర్నాటక, హరియాణా, గోవా, ఢిల్లీల్లో ఫిరాయింపు రాజకీయాలే నడుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కోదండరాం కంటే పెద్ద జాతీయవాది తనకు కనపడటం లేదని, తెలంగాణలో మార్పు కోసం టీజేఎస్ పోరాడాలని ఆయన సూచించారు. హైదరాబాద్‌‌లో శనివారం జరిగిన టీజేఎస్‌‌ తొలి ప్లీనరీలో విశిష్ట అతిథిగా యోగేంద్ర యాదవ్​ పాల్గొన్నారు. ముందుగా పార్టీ అధ్యక్షుడు కోదండరాం​ టీజేఎస్​ జెండాను ఆవిష్కరించి, అమరవీరుల స్థూపానికి, జయశంకర్​విగ్రహానికి నివాళులర్పించారు.

కేంద్రంలో ప్రధాని మోడీ, తెలంగాణలో సీఎం కేసీఆర్‌‌‌‌ ఫిరాయింపు రాజకీయాలకు కేరాఫ్‌‌‌‌ అడ్రస్‌‌‌‌గా నిలిచారని స్వరాజ్ అభియాన్ ఇండియా పార్టీ అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్‌‌‌‌ విమర్శించారు. ప్రస్తుతం కర్నాటక, హర్యానా, తెలంగాణ, గోవా, ఢిల్లీల్లో ఫిరాయింపు రాజకీయాలే నడుస్తున్నాయని.. ఈ పరిణామాలు ప్రజాస్వామ్యానికి మంచివి కావని పేర్కొన్నారు. దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ రాజనీతిని మరిచిపోయాయన్నారు. హైదరాబాద్‌‌‌‌లోని నాగోల్‌‌‌‌లో ఉన్న శుభం గార్డెన్స్‌‌‌‌లో శనివారం తెలంగాణ జన సమితి(టీజేఎస్‌‌‌‌-) తొలి ప్లీనరీ జరిగింది. ముందుగా పార్టీ అధ్యక్షుడు కోదండరాం​ టీజేఎస్​ జెండాను ఆవిష్కరించి, అమరవీరుల స్థూపానికి, జయశంకర్​ విగ్రహానికి నివాళులు అర్పించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి అంబటి శ్రీనివాస్‌‌‌‌ గతేడాది కార్యక్రమాలపై నివేదిక ప్రవేశపెట్టగా, అమర వీరుల సంతాప తీర్మానాన్ని బైరి రమేశ్ చదివారు. పలు తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న యోగేంద్ర యాదవ్​ తొలుత ప్రసంగించారు. కోదండరాం కంటే పెద్ద జాతీయవాది తనకు కనపడటం లేదని, తెలంగాణలో మార్పు కోసం టీజేఎస్ పోరాడాలని చెప్పారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజల్లో నిరాశ ఆవరించిందని, రాజకీయాల్లో అంధకారం నెలకొందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో చీకట్లో చిరుదివ్వెగా టీజేఎస్‌‌‌‌ నిలవాలన్నారు.

ప్రజా సమస్యలపై పోరాడాలి

దేశవ్యాప్తంగా ఆదివాసీలు, వ్యవసాయ సమస్యల మీద ఉద్యమాలు నడుస్తున్నాయని, నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని యోగేంద్ర యాదవ్​ అన్నారు. ప్రతిపక్షాలంటే కేవలం ఎన్నికలప్పుడు ప్రజల్లోకి రావడం, కేవలం ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లకు పరిమితం కావడం కాదని.. ప్రజలు ఎదుర్కొనే ప్రతి సమస్యపైనా స్పందించాలని సూచించారు. టీజేఎస్‌‌‌‌ ప్రజాపక్షం వహించి, ప్రతి సమస్యపై స్పందించడం సంతోషించదగిన విషయమని చెప్పారు. దేశంలో టీజేఎస్‌‌‌‌, స్వరాజ్‌‌‌‌ అభియాన్‌‌‌‌ వంటి భావసారుప్య పార్టీలు అనేకం ఉన్నాయని, అవి కలిసి ప్రత్యామ్నాయ రాజకీయాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో వ్యవస్థల విధ్వంసం జరుగుతోందని, రిజర్వేషన్ల రద్దులాంటి కుట్రలతో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

అందరి కృషితోనే తెలంగాణ: కోదండరాం

తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్కరి వల్లో రాలేదని, సబ్బండ వర్ణాల కృషితోనే ఏర్పడిందని కోదండరాం అన్నారు. ‘తెలంగాణ వచ్చే వరకు తెలంగాణ కోసం పోరాటం చేయాలి. వచ్చాక అభివృద్ధి కోసం పోరాటం చేయాల’న్న జయ శంకర్ సర్ బాటలో జన సమితి నడుస్తుందన్నారు. రాష్ట్రంలో రాజకీయాలు కలుషితమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది కూల్చివేతల కాలం: తిరుమలరావు

పాలకులకు ఇది కూల్చివేతల కాలమని, ప్రజలకు ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టే కాలమని ప్రొఫెసర్‌‌‌‌ జయధీర్‌‌‌‌ తిరుమలరావు అన్నారు. ఇప్పుడా రెండింటి మధ్య ఘర్షణ జరుగుతోందని చెప్పారు. టీజేఎస్‌‌‌‌ ప్రజాపక్షంగా ఉంటూ మేధో కేంద్రంగా పనిచేయాలని సూచించారు. నాయకులు అంబటి శ్రీనివాస్‌‌‌‌, ప్రొఫెసర్‌‌‌‌ పీఎల్‌‌‌‌ విశ్వేశ్వర్‌‌‌‌ రావు, పాండు రంగారావు, ధర్మార్జున్‌‌‌‌, తాళ్లూరి, ప్రొఫెసర్‌‌‌‌ రమేశ్​రెడ్డి పాల్గొన్నారు.

ప్లీనరీలో ముఖ్య తీర్మానాలివీ..

హైదరాబాద్‌‌‌‌లో తెలంగాణ అమరుల స్మృతి వనం ఏర్పాటు చేయాలి.

ఉద్యమ కారులపై పెట్టిన కేసులను ఎత్తి వేయాలి.

ఉద్యమ చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి.

వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌‌‌‌ను ప్రవేశపెట్టి.. రాష్ట్ర బడ్జెట్‌‌‌‌లో 20 శాతం నిధులు కేటాయించాలి.

ఉద్యోగాలు భర్తీ చేయాలి. ప్రైవేట్‌‌‌‌లో 85 శాతం ఉద్యోగాలను తెలంగాణ యువతకే ఇవ్వాలి.

విద్యారంగంలో కామన్ స్కూల్‌‌‌‌ విధానం తేవాలి.

రాష్ట్రంలోని అన్ని పీహెచ్‌‌‌‌సీలు, సీహెచ్‌‌‌‌సీలలో కనీస సౌకర్యాలు కల్పించాలి. ప్రతి జిల్లా కేంద్రంలో 300 పడకల సూపర్‌‌‌‌ స్పెషాలిటీ ఆస్పత్రులు           ఏర్పాటు చేయాలి.

జూన్ 2ను అమరుల దినోత్సవంగా ప్రకటించాలి.

Latest Updates