టీచర్ల నిర్లక్ష్యం.. క్లాస్ రూమ్ లో పాము కరచి విద్యార్ధిని మృతి

పాఠశాలకు వెళ్లిన ఓ విద్యార్థిని తరగతి గదిలో పాము కాటుకు బలైంది.  ప్రతీరోజూ లాగే తోటి పిల్లలతో కలసి  బుధవారం పాఠశాలకు వెళ్లిన ఆ చిన్నారిని పాము కరవడంతో అక్కడికక్కడే మరణించింది. ఈ విషాద సంఘటన కేరళలోని వయనాడ్ జిల్లా సుల్తాన్ బథేరిలో జరిగింది. అక్కడి ప్రభుత్వ పాఠశాల(సర్వాజన్ ఉన్నత పాఠశాలలో)లో ఐదవ తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలిక శహ్లా షెరీన్ ను.. తరగతి గదిలో చదువుకుంటూ ఉండగా.. ఎక్కడి నుంచి వచ్చిందో గానీ ఓ పాము కాటేసింది.

షెరీన్ పాదం మీద రెండు ఎర్రటి మచ్చలు గమనించిన తోటి విద్యార్ధులు వెంటనే పాఠశాల ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేయగా… వారు తేలికగా కొట్టిపారేశారు. విద్యార్థులు ఆ గాట్లు పాము కాటువే అని చెప్పినా, ఉపాధ్యాయులు మాత్రం తరగతి గదిలోకి పాము వచ్చే అవకాశం లేదని వారిని తప్పుబట్టారు.

ఈ సంఘటన జరిగిన దాదాపు 30 నిమిషాల తర్వాత  విషయం తెలుసుకున్న బాలిక తండ్రి పాఠశాలకు చేరుకుని, వెంటనే బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. మొదట సుల్తాన్ బాథరీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి, తరువాత సమీపంలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో, ఆమెను మళ్ళీ ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా… అక్కడి డాక్టర్లు అప్పటికే ఆ చిన్నారి చనిపోయినట్లు ప్రకటించారు.ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Kerala: 10-year-old girl bit by snake in government school, dies

Latest Updates