ఏడేళ్ల బాలుడి తల పగలగొట్టిన ప్రియుడు

kerala-7-years-boy-hit-by-mother's-partner-while-protecting-brother,-illegal-affair

వివాహేతర సంబంధం ఓ చిన్నారి ప్రాణాలు తీసింది. కొన్నేళ్లుగా భర్తకు దూరం ఉంటున్న ఓ మహిళ వేరే వ్యక్తితో సహజీవనం చేస్తుంది. అయితే తన సంతోషానికి అడ్డు వస్తున్నాడని ఏడేళ్ల బాలుడి తల పగలగొట్టాడు ఆమె ప్రియుడు. ఈఘటన కేరళలోని ఏర్రాకుళం జిల్లాలో జరిగింది.

ఎర్నాకుళం జిల్లాలో నివాసం ఉంటున్నఓ మహిళకు ఇద్దరు కుమారులున్నారు.  భర్తతో మనస్పర్థల కారణంగా కొన్నేళ్ల నుంచి వేరుగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె వేరే వ్యక్తితో  సహజీవనం చేస్తుంది. పిల్లలంటే గిట్టని అతడు నిత్యం ఆ చిన్నారులను చిత్రహింసలు పెట్టేవాడు. తల్లి ఉన్నప్పుడు ప్రేమగా నటిస్తూ తల్లి లేనప్పుడు కొట్టేవాడు. గురువారం ఆమె ప్రియుడు నాలుగేళ్ల బాలుడిని కొడుతుండగా పెద్ద కొడుకు అడ్డం వచ్చాడు. దీంతో అడ్డం వచ్చిన ఆ ఏడేళ్ల బాలుడిని చావబాదాడు. తలకు తీవ్ర గాయాలైన  బాలుడిని పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. ఈ విషయం తెలిసిన తల్లి  ఆ బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లింది. అయితే దెబ్బలు తీవ్రంగా తగలడంతో తలకు బలంగా గాయం అయిందని.. ఊపిరి తిత్తులు కూడా దెబ్బతిన్నాయని ఆ బాలుడి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు.  రెండు రోజులు గడిస్తే కాని బాలుడి పరిస్థితి ఏంటనేది చెప్పలేమన్నారు. ఈ విషయం  కేరళ ముఖ్యమంత్రి విజయన్ కు తెలిసింది. ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. అతడి ట్రీట్ మెంట్ ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు.

Latest Updates