5.6 కిలోమీటర్ల పొడవు… వరల్డ్ రికార్డ్ కేక్

5.6 కిలోమీటర్ల పొడవు.. 10 సెంటీమీటర్ల వెడల్పు, ఎత్తు .. 27 వేల కిలోలు.. ఒక కేకు గిన్నిస్ బుక్ రికార్డు కొట్టేయడానికి ఇంతకన్నా ఏం కావాలి? కేరళకు చెందినబేకర్స్ అసోసియేషన్ ఆఫ్ కేరళ (బేక్ ) ఈ ఫీట్ ను సక్సెస్ ఫుల్ గా సాధించింది. రాష్ట్రంలోని 1500 మంది బేకర్లు, షెఫ్ లు కలిసి ఈ కేకును బేక్ చేశారు. కేకు తయారీకోసం 12 వేల కిలోల పిండి, చక్కెర పట్టిం దట. జనవరి 15న 4 గంటల పాటు కష్టపడి ఇష్టంగా ఈ కేకును తయారు చేశారు. తమ స్కిల్స్ ను ప్రపంచానికి చాటిచెప్పేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించి నట్టు బేక్ సెక్రటరీ జనరల్ నౌషద్ చెప్పారు . కేకు తయారీలో ఎక్కడా రాజీపడలేదని, శుభ్రత, టేస్ట్​ విషయంలో వెనక్కు తగ్గలేదని చెప్పారు . అందుకే గిన్నిస్ బుక్కోళ్లు రికార్డు ఇచ్చేశారు. సర్టిఫికెట్ ను బేక్ చేతిలో పెట్టారు . అంతకుముందు చైనాలోని జిక్సీ ప్రావిన్స్ కు చెందిన బేకర్లు2018లో 3.2 కిలోమీటర్ల కేకును తయారు చేశారు. జిక్సీ బ్రెడ్ ఇంటర్నేషనల్ టూరిజం ఫెస్టివల్ లో భాగంగా ఆ కేకును బేక్ చేశారు. అయితే, మొత్తం 180 మందికలిసి తయారు చేశారు ఆ కేకును. దాదాపు 23 గంటలు పట్టింది. ఇప్పుడు కేరళ కేకు ఆ రికార్డును బద్దలు కొట్టింది.

Latest Updates